Take a fresh look at your lifestyle.

ఏ‌ప్రిల్‌లో తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా టూర్‌

‌మేధావులతో సమావేశం, బండి సంజయ్‌ ‌పాదయాత్రకు హాజరు

ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌తెలంగాణలో కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి బండి సంజయ్‌ ‌టూర్‌ ‌ఖరారైనట్లు సమాచారం. ఏప్రిల్‌ ‌నెలలో ఆయన రాష్ట్రంలో రెండు పర్యాయాలు పర్యటించనున్నారు. ఏప్రిల్‌ 1‌న అమిత్‌ ‌షా తెలంగాణ వొస్తారనీ, పలువురు మేధావులతో హైదరాబాద్‌లో ఆయన భేటీ అవుతారనీ, ఆయన సమక్షంలో పలువురు ప్రముఖులు బీజేపీలో చేరుతారని సమాచారం.

శ్రీరామ నవమి రోజు భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి హాజరై పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెబుతున్నారు. అదే రోజు హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారని పార్టీ వర్గాల సమాచారం. ఏప్రిల్‌ 14‌న గద్వాల నుంచి ప్రారంభం కానున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పాదయాత్రను అమిత్‌ ‌షా ప్రారంభిస్తారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

Leave a Reply