- తెలంగాణపై కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్ధన్ ప్రశంసలు
- కరోనాపై నెగిటివ్ ప్రచారమే ఎక్కువ: మంత్రి ఈటెల
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. దీనికి సంబంధించి మరింత ముందుకు వెళ్లేందుకు ఎన్ 95 మాస్కులను అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఈటలతో పాటు స్పెషల్ చీప్ సెక్రటరీ శాంతికుమారి, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ యోగితా రాణా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు చేపట్టిన చర్యలను వివరించారు. మరో కరోనా లాబ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ఈ వ్యాధి విస్తరించకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను వివరించారు. తెలంగాణ రాష్ట్రం పకడ్బందీ ప్రణాళికతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళుతోందనీ, మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణను అనుసరించాలని కేంద్ర మంత్రి సూచించారు.
కరోనాతో పౌల్ట్రీ రంగానికి నష్టం: ఈటల
కరోనా వైరస్ భయం కారణంగా రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ భారీగా నష్టపోయిందని మంత్రి ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. చికెన్, గుడ్లు తింటే కరోనా సోకుతుందని సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేశారనీ, దీంతో ఈ పరిస్థితి నెలకొందని వాపోయారు, వ్యక్తిగతంగా తాను కూడా దాదాపు రూ. 7 కోట్లు నష్టపోయాయని ఈ సందర్భంగా మంత్రి ఈటల వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌పై నెగిటివ్ ప్రచారం ఎక్కువగా జరుగుతోందని వైద్ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం ఆయన డియాతో మాట్లాడుతూ గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో వసతులు సరిగా లేవని జూనియర్ డాక్టర్లు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోందన్నారు. వైద్య సిబ్బందికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. డాక్టర్లే మాస్క్‌లు వేసుకుని తిరుగుతే జనాల్లో ఇంకా భయం పెరుగుతుందన్నారు. తెలంగాణలో నివసిస్తున్నవారికి కరోనా సోకలేదని అన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికే వైరస్ వచ్చిందన్నారు. ప్రజలకు పారామెడికల్ సిబ్బంది అవగాహన కల్పించాలని ఈటల రాజేందర్ సూచించారు.