Take a fresh look at your lifestyle.

హాట్‌ ‌స్పాట్లను గుర్తించండి ..పెరుగుతున్న కొరోనా వైరస్‌ ‌పై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ :దేశవ్యాప్తంగా మరోసారి కొరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులో భాగంగా మహమ్మారి కొరోనా వైరస్‌ ‌విజృంభిస్తోన్న రాష్ట్రాల ఉన్నతాధికారులతో శనివారం క్యాబినేట్‌ ‌సెక్రటరీ రాజీవ్‌ ‌గౌబా హైలెవల్‌ ‌సమావేశం నిర్వహించారు.

home

హొ ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్రాల చీఫ్‌ ‌సెక్రటరీలు, ఆరోగ్య శాఖ కార్యదర్శులు, ఐసీఎంఆర్‌ ‌డీజీ, కేంద్ర హోంశాఖ ప్రతినిధులు, నీతి ఆయోగ్‌ ‌సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీష్‌ ‌గడ్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌గుజరాత్‌, ‌పంజాబ్‌, ‌పశ్చిమ బెంగాల్‌, ‌జమ్మూ కాశ్మీర్‌ ‌లోని తాజా పరిస్థితులను ఈ సమావేశంలో చర్చించారు.

కోవిడ్‌ 19 ‌మహమ్మారిని నివారించే దిశలో అన్ని రాష్ట్రాలు టెస్టింగ్‌ ‌సామర్థ్యాన్ని పెంచుకోవాలని, ఆర్టీ-పీసీఆర్‌ ‌టెస్టులు ఎక్కువ చేయాలని ఈ సందర్భంగా రాజీవ్‌ ‌గౌబా రాష్ట్రాలకు సూచించారు. అలాగే, కొరోనా కొత్త రకాలపై పర్యవేక్షణ, హాట్‌స్పాట్ల గుర్తింపు చేపట్టాలన్నారు. కేసులు ఎక్కువున్న జిల్లాలకు ప్రాధాన్యతనిస్తూ వ్యాక్సినేషన్‌ ‌చేపట్టాలని ఆదేశించారు. వ్యాక్సీనేషన్‌ ‌డ్రైవ్‌ ‌టైంలో రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

భౌతిక దూరం, మాస్క్ ‌వాడకాన్ని పెంచటం వంటి చర్యలను తప్పక అమలు చేయాలని ఆదేశించారు. కాగా, మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, ‌కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌ ‌రాష్ట్రాల్లో- కొరోనా వైరస్‌ ‌తిరిగి విజృంభిస్తుందని కేంద్రం తెలిపింది.హొ మహారాష్ట్రలో అత్యధికంగాహొ రోజుకు దాదాపు 8,333 కేసులు నమోదు కాగా, కేరళలో 3,671,హొ పంజాబ్‌లో 622 కొత్త కేసులు రికార్డు అయ్యాయి. ఫిబ్రవరి 14 న మహారాష్ట్రలో 34,449 కేసులు నమోదు కాగా…. రెండు వారాల్లోనే ఆ సంఖ్య 68,810 చేరింది.

Leave a Reply