Take a fresh look at your lifestyle.

పసుపు బోర్డు ఏర్పాటు ఆలోచన లేదు..! స్పష్టం చేసిన కేంద్రం

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ: తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏం లేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ సుగంధ ద్రవ్యాల ఏగుమతుల ప్రచారానికోసం కేంద్ర వాణిజ్య శాఖ స్పైసెస్‌ బోర్డు రీజినల్‌ కార్యాలయాన్ని నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడించారు.

పసుపుతో పాటు ఇతర సుంగధ ద్రవ్యాల ఎగుమతి ప్రచారం కోసం వరంగల్, హైదరాబాద్,నిజామాబాద్, ఖమ్మం నగరాల్లో బోర్డు కార్యాలయాలు ఉన్నాయన్నారు. అంతేగాక 2019–20 సంవత్సరంలో తెలంగాణలో 55వేల హెక్టార్లలో మూడు లక్షల 86వేల టన్నుల పసుపును ఉత్పత్తి చేసినట్టు టీఆర్‌ఎస్‌ ఎంపీ కెఆర్‌ సురేష్‌రెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Leave a Reply