Take a fresh look at your lifestyle.

అసోంలో ఎడతెరిపిలేని వాన

8 మంది మృతి… కొండచరియలు విరిగి నిరాశ్రయులుగా మారిన వేలాది మంది
కర్నాటక, కేరళలోనూ వర్షాలు

న్యూ దిల్లీ, మే 19 : ఎడతెరిపి లేని వర్షాలు  అస్సాంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. వారం రోజులుగా భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని  ముంచెత్తుతున్నాయి. కొండ చరియలు విరిగిపడి వరద నీరు పోటెత్తడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 27 జిల్లాల్లో సుమారు 1,089 గ్రామలు నీటమునిగాయి. సుమారు 6 లక్షల మంది  వరదల ప్రభావానికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, పోలీసులు రంగంలోకి దిగి ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. వరదల ప్రభావానికి ఇప్పటివరకు ఎనిమిది మంది చనిపోయారు.

అసోంలోని పరిస్థితులపై కేంద్రహోంమంత్రి అమిత్‌ ‌షా ఆరా తీశారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మతో మాట్లాడారు. కేంద్రం తరఫున అన్ని విధాలా సాయం చేస్తామని హావి• ఇచ్చారు. ఇక కేరళలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. కోజికోడ్‌, ‌వయనాడ్‌, ‌కన్నూర్‌, ‌కాసరగోడ్‌, ‌పాలక్కడ్‌, ‌మలప్పురం, త్రిశూర్‌ ‌జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచింది. రానున్న 5 రోజులపాటు కేరళలో భారీ వర్షాలు పడే అవకాశముందంది వాతావరణ శాఖ. కన్నూర్‌, ‌కాసరగోడ్‌ ‌జిల్లాలకు రెడ్‌ అలెర్ట్ ‌జారీ చేసింది. ఇక భారీ వర్షానికి కర్ణాటక రాజధాని బెంగళూరు వణికిపోయింది.

బెంగళూరులో కాల్వలు నిండిపోయాయి. రోడ్లపై నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో వాహన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఎయిర్‌ ‌పోర్టుకు వెళ్లే మార్గంలో 4 అడుగుల మేర నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏపీలోని కృష్ణా జిల్లా ప్రజలు వారం రోజులుగా తీవ్ర ఎండలకు అల్లల్లాడిపోతుండగా ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారింది. గుడివాడలో గురువారం ఉదయం నుంచి తేలికపాటి వర్షం పడుతుంది.

Leave a Reply