Take a fresh look at your lifestyle.

బలిదానాలు వద్దు… బరిగీసి నిలుద్దాం

నిరుద్యోగుల ఆత్మ స్థైర్య సదస్సు,సూర్యాపేట నవంబర్‌ 6‌న..

నిరుద్యోగసోదరులారా!
ఆత్మగౌరవ కోసం ప్రాంతే తరుణ్ణి ప్రాంతం దాటేవరకు తరిమాం ..మోసంచేస్తున్న ప్రాంతం వాన్ని ప్రాంతంలో నే బొం దపెట్టలేమా. ..? స్వంత రాష్ట్రంలో విద్య అందరికి అందుబాటులో వుంటదనుకున్నాం ప్రభుత్వం కె. జి టు పిజి ఉచిత విద్య అంటూ గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి కొత్త కొత్త పేర్లతో ఉన్న విద్యా సంస్థలను మూసివేసె కుట్రలు చేస్తున్నాడు . విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్‌ ‌షిప్‌ ‌లు ఇవ్వడం లేదు. మిగులు రాష్ట్రం, సంపన్న ప్రభుత్వం అంటూ తమకు తాము కితాబులిచ్చు కుంటున్న వాళ్ళు 4000 కోట్ల పెండింగ్‌ ‌స్కాలర్‌ ‌షిప్‌ ‌లు ఇవ్వకుండా విద్యార్థుల ను నానా హరిగోస పెడుతున్నారు. మరోవైపు కార్పొరేట్‌ ‌యాజ మాన్యాలు ఫీజులుం చేస్తున్నాయి. హొ హొ ఇంకో వైపు నిరుద్యోగం పెరిగిపోతుంది. ఉద్యోగం ఆకలిసమస్యే కాదు ఆత్మగౌరవ సమస్యకూడాలి.. వివిధ వృత్తులలో పనిచేసి ఎన్నొకష్టాలకోర్చి ఉన్నత చదువులు చదివించి కోచింగ్‌ ఇప్పిచ్చి ఇగ మా స్వరాష్ట్రంలో మా పిల్లలు ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందుకుంటారని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు నిరాశ ఎదురయ్యింది. ఇటు ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేయక ఎన్నికల టు ఎన్నికలకు వాయిదా వేస్తుంటే పాలకుల ఉద్యోగ ఖాళీల లెక్కలు చూస్తుంటే ఇగ ఈ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫ్కేషన్‌ ‌వేయదేమో అనే బెంగతో తల్లి దండ్రులకు మొఖం చూపించ లేక నిరుద్యోగ యువత బలవర్మరణాలకు పాల్పడుతున్నారు .అటు కొండలు ఇటు బోడ సునీల్‌ ‌ల మరణ వాంగ్మూలం నిరుద్యోగుల ఆత్మగౌరవ తండ్లాట ను ప్రపంచానికి ఎత్తిచూపినాయి. ఏ నియామకాలు ప్రధాన ఎజెండాగా కోట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో ఇప్పుడు ఆనియామకాలనే గందరం గోళంచేస్తుంది కేసీఆర్‌ ‌కుటుంబం.

అధికారాన్ని ఆ కుటుంబం కబంధ హస్తాలలో బందించుకొని అన్ని శాఖలను నిర్వీర్యం చేసి అన్ని లెక్కలు తామే చెబుతు ఉద్యోగ కాళీలు ,ఉద్యొగాల భర్తీ పై టి.పి.పి.యెస్‌. ‌సి లెక్కలకు భిన్నంగా కె. టి.ఆర్‌ ఒక అంకె హరీష్‌ ‌రావ్‌ ఇం‌కొక ఒక అంకె. వందిమాగధ తొత్తు ప్రజాప్రతినిధులు మరొక అంకెలతో వాస్తవాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారు. . టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన ఈ ఏడేండ్ల కాలంలో కేవలం 85 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి లక్షా ముప్పై రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేశామని అబద్దాలు చెబుతున్నారు.కొత్త నోటిఫికేషన్లు వేయక పోగా ఉన్న ఉద్యోగాలను తీసేస్తుంది 21,200,సర్వశిక్ష అభియాన్‌,16,400‌ విద్యావాలంటీర్లను, 7,651మహాత్మాగాంధీ ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్స్,2000 ‌పంచాయతీ కార్యదర్శులు, 709 మిషన్‌ ‌భగీరథ,315,హార్టీ కల్చర్‌ 2,640 ‌సోషల్‌ ‌వెల్ఫేర్‌,, ఆర్టీసీ ,విద్యారంగం లో,1640 మంది నర్సులు ఇలా వివిధ ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్న వారిని ఉద్యోగంలోంచి తీసివే• వారి జీవితాలను ఛిద్రం చేసింది ప్రభుత్వం… కాంట్రాక్ట్ ‌లు , కమీషన్లు ఓట్లు,నోట్లు తప్ప యువత కు ఉపాదికల్పన అనే ఆలోచనే లేని కేసీఆర్‌ ‌వ్యవహారం తో విసిగి వేసారిన యువకులు ఆత్మ విశ్వాసం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

తాము చదివిన చదువులకు సంబంధం లేని అనుభవం లేని పనులుచేస్తూ జీవనం వెళ్లదీయలేక పెద్ద చదువులు చదివి సుతారి పనికి పోతే మీ సదువుకున్నోళ్లుకూడా సుతారి పనికి వస్తే మా సదువురాని కూలి వాళ్లకు పనిదొరుకుతదా అంటూ. . అయినా మిమ్మల్ని చూసినంక మాపిల్లలకు చదువుకంటే ఏదయినా పని నేర్పితే బతుకడం నేర్చుకునేట్లుగావుంది అని పనిచేసేకాడ పక్కాయన అంటుంటే ఎం. ఏ .బి .యి. డి చేసిన ప్రయివేటు టీచర్‌ ‌తలెత్తుకోలేక తాడును మెడకు చుట్టుకొని తనువుచాలించినా కనికరించని మన స్వంత పాలకుని తీరును నిలదీద్దాం .ఓట్ల కోసం తన ఏలుబడిలో సీమాంధ్రుల కాలుకు ముల్లుకుచ్చుకున్నా పంటి తో తీస్తానని బహిరంగ భరోసా ఇచ్చి హైదరాబాద్‌ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్న కేసీఆర్‌ ‌కు ఆత్మహత్యలు వద్దు ప్రభుత్వం మీకు అండగా వుంటుందనే కనీస భరోసా ఇచ్చే తీరుకలేని పరిస్థితి . ఇగ ఎమ్మెల్యే లేమో మురికి కాలువలు రోడ్లు అంటూ తీసినవే తీసే తవ్వినవేహొతవ్వి కమీషన్‌ ‌వచ్చే కాంట్రాక్టు పనులచుట్టు అభివృద్ధి ముసుగేసి భజనలు చేయించుకుంటున్నారే తప్ప తమ నియోజకవర్గాల్లో యువతకు స్వయం ఉపాధి కల్పన ఉద్యోగ వకాశాలు స్థానికంగా సృష్టించే ప్రణాళికలు ఆలోచించే తీరికలేదు. ఒకవైపు ఉద్యోగాల లోటు మరోవైపు కొరోనా కాటుకు గురయి ఉపాధి పొందలేని అందరూ ఏకమవుదాం ఈ ప్రభుత్వాలను నిలదీద్దాం .ఉద్యోగ ఉపాధి కల్పన ప్రభుత్వ భాద్యతే . ఆత్మహత్యలు వద్దు. రండి ఆత్మస్థైర్యం తో నిలబడదాం…కొట్లాడుదాం కొలువులను సాధించుకుందాం … !

యువజన సమితి, విద్యార్థి జన సమితి
సూర్యాపేట జిల్లా కమిటీ

Leave a Reply