Take a fresh look at your lifestyle.

నిరుద్యోగ పోరు !

నిరుద్యోగ దళాలు కొలువుల
కొట్లాటకు కదంతొక్కుతున్నయ్‌

ఉద్యోగ సాధనే ఎజెండాగా…
ఉద్యమ భేరి మోగిస్తున్నయ్‌

ఉపాధి కల్పనే ధ్యేయంగా..
విప్లవ జెండా ఎగరేస్తున్నయ్‌

ఆత్మ గౌరవమే నినాదంగా…
తిరుగుబాటు బాట పట్టినయ్‌

‌నిర్బందాలకు వెరవమని
ధిక్కార స్వరం విపిస్తున్నయ్‌

‌లాఠీ,తూటాకు జంకమని
రొమ్ము విరిచి నిలబడ్డయ్‌

‌కేసులు జైళ్లు కొత్త కాదని
తొడగొట్టి సవాల్‌ ‌చేస్తున్నయ్‌

ఇక తాడో పేడో తేల్చుకొన
యుద్దానికి సన్నద్దమైనయ్‌

ఓయి పాలకులారా !
ఓట్లు దండుకునే దాక…
హామీల వర్షం కురిపించి
ఆశల పల్లకిలో ఊరేగిస్తిరి

అధికార పీఠం ఎక్కినంక..
రాక్షస పాలన సాగిస్తుంటిరి

నమ్మబలుకు ముచ్చట్లతో…
ఉద్యోగ లెక్కలు ఏమారిస్తిరి

మోసపూరిత చేష్టలతో…
నోటిఫికేషన్లు పక్కనేస్తిరి

బహురూపుల వేషంతో…
ఉపాధికి ఉరితాడు బిగిస్తిరి

ఇకనైనా…
మీ నియంత పోకడ వీడనాడి
ఇచ్చిన మాటకు కట్టుబడండి

కాదని తోక జాడించ యత్నిస్తే
గడీల పునాది కదలుట ఖాయం
చీకటి పాలన కడతేరుట నిక్కం

           – కోడిగూటి తిరుపతి
                   95739294943

Leave a Reply