Take a fresh look at your lifestyle.

త్వరలోనే నిరుద్యోగ భృతి ప్రకటన

  • 50వేల ఉద్యోగాల భర్తీ పక్రియననూ పూర్తి చేస్తాం
  • కరెంట్‌ ‌కోతలను లేకుండా చేసిన ఘనత కెసిఆర్‌దే
  • బండ సంజయ్‌, ఉత్తమ్‌లు నోరు అదుపులో పెట్టుకోవాలి
  • మా సహనానికీ ఓ హద్దు ఉంటుంది
  • విద్యుత్‌ ఉద్యోగలు సమావేశంలో మంత్రికెటిఆర్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌త్వరలోనే నిరుద్యోగ భృతి ప్రకటించవచ్చు అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో రాష్ట్ర విద్యుత్‌ ‌కార్మిక సంఘం సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌, ‌తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. సీఎం కేసీఆర్‌ ‌త్వరలోనే నిరుద్యోగ భృతి ప్రకటించవచ్చన్నారు. ఇప్పటికే లక్ష 31 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లుగా తెలిపారు. త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాల భర్తీ పక్రియను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

విద్యుత్‌ ఉద్యోగుల కృషితో రాష్ట్రంలో 7 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని 14 వేలకు పెంచగలిగినట్లు మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడా కరెంట్‌ ‌సమస్య లేదన్నారు. భవిష్యత్తులో ఇక కరెంట్‌ ‌పోదని ఖచ్చితంగా చెప్పగలమన్నారు. గతంలో అన్ని రంగాలకు కరెంట్‌ ‌సమస్య తీవ్రంగా ఉండేదన్న కేటీఆర్‌.. ‌సీఎం కేసీఆర్‌ ‌నేతృత్వంలో వీటన్నింటిని అధిగమించి ముందుకెళ్తున్నట్లు చెప్పారు. సోలార్‌ ‌విద్యుత్‌ ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని కేటీఆర్‌ అన్నారు. తలసరి విద్యుత్‌ ‌వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు. దేశంలో పరిశ్రమలకు సరిపడా కరెంట్‌ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణెళి మాత్రమేనన్నారు.

అన్ని రంగాలకు నాణ్యమైన కరెంటు ఇస్తున్నట్లు చెప్పారు. విద్యుత్‌ ‌కార్మికుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని కేటీఆర్‌ ఈ ‌సందర్భంగా తెలిపారు. ఎక్కడా లోటులేకుండా ప్రతిరంగానికి సీఎం కేసీఆర్‌ ‌న్యాయం చేశారన్నారు. ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌ ‌నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి కేటీఆర్‌ ఈ ‌సందర్బంగా హెచ్చరించారు. కేసీఆర్‌ ‌తెలంగాణ తేకపోతే టీపీసీసీ, టీబీజేపీ అధ్యక్ష పదవులు లేవన్నారు. తమ సహనానికి హద్దు ఉంటుందన్నారు. నిన్న ఇవాళ కొంత మంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒకరు టీపీసీసీ, ఒక టీ బీజేపీ. ఈ టీ(తెలంగాణ)అనే పదం కేసీఆర్‌ ‌పెట్టిన భిక్ష. తెలంగాణ తీసుకొచ్చింది సీఎం కేసీఆర్‌. ‌పెరిగిన ఆదాయం అన్ని రంగాలకు చేయూతకే అని అన్నారు. ఇలాంటి ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలిన ఇష్టానుసారంగా మాట్లాడిన వి•రు తప్పక తిప్పికొట్టాలి.

రాష్ట్ర సాధనకు వి•రు ఏ విధంగా ఉద్యమం చేశారో అలాగే వీటిని కూడా తిప్పికొట్టాలఅని కేటీఆర్‌ ‌పిలుపునిచ్చారు. ప్రతీ రంగానికి కేసీఆర్‌ ‌న్యాయం చేశారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ‌త్వరలో నిరుద్యోగ భృతి కూడా ప్రకటిస్తారని తెలిపారు. దేశానికే తెలంగాణ ధాన్య భాండాగారంగా మారిందన్నారు. ఉమ్మడి ఎపిలో సిరిసిల్లలో కరెంట్‌ ‌కావాలని ఏఈని అడిగే వాళ్ళమని అన్నారు. జలవిద్యుత్‌ ‌కేంద్రం, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం, 7 ముంపు ప్రాంతాలు ఏపీలో కలిపారని తెలిపారు. పవర్‌ ‌హాలిడే వారానికి మూడు రోజులు ఉండేదని, ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం అవన్నీ అధిగమించి కేసీఆర్‌ ‌నాయకత్వంలో ముందుకెళ్తున్నామని తెలిపారు. ఆ కష్టం అంతా విద్యుత్‌ ‌కార్మికులదేనని కొనియాడారు. 7వేల మెగావాట్ల నుండి.16 వేళా మెగావాట్ల ఉత్పత్తికి ఎదిగామని తెలిపిన కేటీఆర్‌ ‌సోలార్‌ ‌విద్యుత్‌లో రెండో స్థానంలో ఉన్నామన్నారు. 28 రాష్ట్రాల్లో ఎప్పుడూ ముందున్న రాష్ట్రాల కంటే తలసరి విద్యుత్‌లో తెలంగాణ ముందుందని వెల్లడించారు.

పరిశ్రమలకు కరెంట్‌ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, కొత్త విద్యుత్‌ ‌కేంద్రాలు, కొత్త లైన్లు అన్ని తీసుకొచ్చింది తెలంగాణా మాత్రమేనని ప్రశంసించారు. గతంలో మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవని, కానీ ఇప్పుడు నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్నామని తెలిపారు. విద్యుత్‌ ‌కార్మికుల సమస్యలు అన్ని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఇది వి•, మా ప్రభుత్వం. ప్రత్యేక చొరవ తీసుకుంటాం. మౌలిక సమస్యలు అన్ని పరిష్కారం అవుతున్నాయి. అందులో వి• కృషి కూడా ఉందన్నారు. వాయువేగంతో కాళేశ్వరం లిప్ట్ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్ట్ ‌పూర్తి చేసాం. సాగు తాగు నీరు ఇస్తున్నాం. ధాన్యబాండగారంగా తెలంగాణ నిలిచింది. ఈ ఆరున్నర ఏళ్లలో కేసీఆర్‌ అన్ని పూర్తి చేశారు. 945 గురుకుల పాఠశాలలు, విదేశాలలో చదువుకునే విద్యార్థులకు ఆర్థికంగా చేయూత. నిరుద్యోగ భృతి రేపో మాపో కేసీఆర్‌ ‌ప్రకటిస్తారు. 50 వేల ఉద్యోగాలు కూడా ప్రకటించారు. అవి కూడా భర్తీ చేస్తామన్నారు. ప్రతి రంగాన్ని ఎక్కడ లోటు లేకుండా న్యాయం చేశారని అన్నారు.

Leave a Reply