Take a fresh look at your lifestyle.

ప్రపంచ యువత – నిరుద్యోగ గోసా

“కొరోనా వైరస్‌ ‌వల్ల ప్రపంచ వ్యాప్తంగా 25 మిలియన్ల యువత ఉద్యోగాలు కోల్పోవచ్చాని, దీనివల్ల 860 బిలియన్స్ ‌నుంచి 3.4 ట్రిలియన్స్ ‌డాలర్ల ఆదాయం నష్ట పోనున్నట్లు, కోవిడ్‌-19 ‌వల్ల ప్రపంచ వ్యాప్తంగా 35 మిలియన్ల ప్రజలు పేదరికంలోనికి నెట్టి వేయబడుతున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ పేర్కొంది.”

ఏ దేశ భవి ష్యత్తు అయిన ఆ దేశంలో  పనిచేసే వారిపై ముఖ్యంగా యువతపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ దేశ యువత ని అభివృద్ధి వైపు మలచడం ఆయా దేశాల బాధ్యత.1999వ సంవత్సరంలో ప్రపంచ యువజన వ్యవహారాల మంత్రుల సమావేశం ఆగస్టు 12 ని అంతర్జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించాలని సిఫార్సు చేయడంతో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ఆ సిఫార్సు ను ఆమోదించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక థీమ్‌ ‌తో అంతర్జాతీయ  యువజన దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం 2020 యువజన దినోత్సవాన్ని లిగ్లోబల్‌ ‌యాక్షన్‌ ‌కోసం ఎంగేజ్మెంట్‌ అనే థీమ్‌ ‌తో  జరుపుకుంటున్నాం. యువత కోసం గ్లోబల్‌ ‌యాక్షన్‌ ఎం‌గేజ్మెంట్‌ అన్నది స్థానిక, జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ఉండాలన్నది థీమ్‌ ఉద్దేశం. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువతను (15-24 సంవత్సరాల వయస్సు గలవారు) చూస్తే మొత్తం 1.2 బిలియన్‌ ‌మంది  ఉన్నారు .మొతం ప్రపంచజనాభాలో 17%  వీరే ఉన్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 1.3 బిలియన్‌ ‌కు పెరుగుతుంది.ఈ సంఖ్య ప్రపంచంలో అంతట ఒకే విధంగా లేదు.వీరిలో 87 శాతం యువత అభిరుద్దిచెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. సబ్‌ ‌సహారా,దక్షిణాసియాలో  ఈ సంఖ్య పెరుగుతూ ఉంటే, మిగిలిన ప్రపంచ దేశాలలో ఈ సంఖ్య తగ్గుతుంది. వీరిలో ప్రపంచవ్యాప్తంగా 70.9 మిలియన్ల యువకులు నిరుద్యోగులుగా ఉన్నారని ఒక అంచనా.2008 ఆర్థిక మాంద్యంతో ప్రారంభమైన నిరుద్యోగ పర్వం, కొవిడ్‌-2019 ‌తో 2020 నాటికి తీవ్ర స్థాయికి చేరుకుంది. యూరోప్‌ ‌లో సుమారు 90 మిలియన్ల యువత ఉన్నారు.అత్యధిక యువత  ఐర్లాండ్‌, ‌సైప్రస్‌, ‌స్లోవేకియా, పోలాండ్‌లో ఉన్నాసు. వీరిలో నిరుద్యోగ రేటు 15.71% ఉంది.ఉత్తర అమెరికాలో 42 మిలియన్ల యువత ఉన్నారు.ఈ సంఖ్య జనాభాలో 14% గా ఉంది.ఇక్కడ నిరుద్యోగ రేటు 2019 ఆగస్టులో 8.6% నుంచి ఈ కరోనా కాలంలో జూన్‌ 2020 ‌నాటికి 20.7% కి పెరిగింది.ఆసియా ప్రాంతంలో 718 మిలియన్ల యువత ఉన్నారు. పాలస్తీనా, జార్జియా, బ్రునే, ఇరాన్‌, ‌భారత్‌, ‌శ్రీలంకలో నిరుద్యోగ రేటు చాలా ఎక్కువగా ఉంది.ఆఫ్రికాలో  226 మిలియన్ల యువకులు , అనగా  ప్రపంచంలో 20 శాతం యువకులు ఇక్కడే ఉన్నారు.2030 నాటికి వారి శాతం 42 కి పెరుగుతుంది. ఇక్కడ యువకుల్లో   నిరుద్యోగిత రేటు 25% గా ఉంది.బాట్స్వన,కాంగో రిపబ్లిక్‌, ‌సెనెగల్‌, ‌సౌత్‌ ఆ‌ఫ్రికా దేశంలో చాలా ఎక్కువ. సౌత్‌ అమెరికాలో 154  మిలియన్ల యువత ఉంది.ఈ సంఖ్య బ్రెజిల్‌,‌మెక్సికో, అర్జెంటీనా లో అత్యధికంగా ఉన్నారు.ఇక్కడ నిరుద్యోగం రేటు18% కన్న ఎక్కువే.

కొరోనా వైరస్‌ ‌వల్ల ప్రపంచ వ్యాప్తంగా 25 మిలియన్ల యువత ఉద్యోగాలు కోల్పోవచ్చాని, దీనివల్ల 860 బిలియన్స్ ‌నుంచి 3.4 ట్రిలియన్స్ ‌డాలర్ల ఆదాయం నష్ట పోనున్నట్లు, కోవిడ్‌-19 ‌వల్ల ప్రపంచ వ్యాప్తంగా 35 మిలియన్ల ప్రజలు పేదరికంలోనికి నెట్టి వేయబడుతున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ పేర్కొంది.ప్రపంచ యువతలో ఐదో వంతు సుమారు 20 శాతం యువత భారతదేశంలో ఉంది.130 కోట్ల జనాభా లో సగం మంది 25 సంవత్సరాల లోపు వారే,2020 నాటికి యువకులశాతం 34.5 గా ఉండవచ్చు అని ఒక అంచనా. ప్రతి సంవత్సరం దేశంలో 3.5 లక్షల ఇంజనీరింగ్‌ ‌పట్టభద్రులు,25 లక్షల గ్రాడ్యుయేట్‌ ‌పట్టభద్రులు బయటికి వస్తున్నారు. ఆర్థిక అసమానతలు, లింగవివక్షత,సాంకేతిక అడ్డంకులు, లోపభూయిష్టమైన విద్యావిధానం వల్ల ప్రతి సంవత్సరం నిరుద్యోగ రేటు పెరుగుతూనే ఉంది. ఈ సంఖ్య 2017 లో 22.7 % ఉండగా,2018 లో 22.85 శాతానికి 2019లో 23.3 4 శాతానికి పెరిగింది,ఈ  కరోనా కాలంలో నిరుద్యోగ రేటు ఇంకా పెరిగి ఉండొచ్చు. ఈ సమస్యకు కొంతలో కొంత ఉపశమనం కల్గించాలంటే 10 మిలియన్స్ ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. కోవిడ్‌-19 ‌వల్ల సుమారు 27 మిలియన్‌ ‌యువత ఉద్యోగాలు కోల్పోతారని సెంటర్‌ ‌ఫర్‌ ‌మానిటరింగ్‌ ఇం‌డియన్‌ ఎకానమీ తెలిపింది. దీనివల్ల భారత్‌ ‌కు ఉన్న జనాభా డివిడెండ్‌ ‌వల్ల ఎటువంటి లాభం లేకుండా పోతుంది.నిరుద్యోగులు పెరగటం వల్ల ఆర్థిక ,సామాజిక సమస్యలు ఏర్పడతాయి. సామాజిక అశాంతి పెరిగి,నేరాల రేటు,మాదక ద్రవ్యాల వినియోగం కూడా పెరిగి మానసిక రుగ్మతలకు దారి తీయవచ్చు.ప్రపంచ యువతలో నిరుద్యోగం పెరగటానికి ప్రధానంగా కారణం  జనాభా పెరగడం,ఆర్థిక సంక్షోభ ంరావడం, నైపుణ్యాలు లేకపోవడం, వృత్తి విద్యలో లోపం, సాంకేతిక పరిజ్ఞానం మారుతూ ఉండడం,ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు రావడం మొదలైన కారణాలుగా చెప్పవచ్చు. వ్యవ స్థాపకతను ప్రోత్సహించడం, ఇంటర్నల్‌ ‌షిప్ను లో నాణ్యతను పెంచడం, కళాశాలలతో పారిశ్రామిక యాజమాన్యాలకు చురుకైన భాగస్వామ్యాన్ని కలిగించడం,కెరీర్‌ ‌గైడెన్స్ అం‌దించడం, పనిఅనుభవానికి అవకాశం ఇవ్వడం,అప్రెంటిష్‌ ‌ని ఆధునీకరిం చడం, వెనుకబడిన యువతకు సరైనటువంటి అవకాశాలు కల్పించడం మొదలైన చర్యల వల్ల నిరుద్యోగ రేటును తగించవచ్చు. ముఖ్యంగా అభిరుద్దిచెందుతున్న దేశాల సంపద యువత.అట్టి యువతకు సమాజానికి పనికివచ్చే విద్యను అందిస్తూ వారి శక్తిని దేశాభివృద్ధికి ఉపయోగిస్తేనే,వర్ధమాన దేశాలన్ని రాబోయే కాలాల్లో అభిరుద్దిలో ముందు వరుసలో ఉంటాయి.

 Jurru Narayana Yadav Ooty TU District Presidents Mahabubnagar‌, 494019270
జుర్రు నారాయణ యాదవ్‌
‌టి టి యు జిల్లా అధ్యక్షులు
మహబూబ్నగర్‌, 494019270

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply