Take a fresh look at your lifestyle.

సిద్దిపేట హాస్పిటల్‌లో మోకాలు చిప్పల మార్పిడి

  • పేషెంట్లకు మంత్రి హరీష్‌ ‌రావు పరామర్శ
  • త్వరలో అన్ని జిల్లా హాస్పిటల్స్‌లోనూ మార్పిడి
  • నిరుద్యోగులకు వెంటనే ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి : అధికారులకు మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశం

సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 3 : గాంధీ, ఉస్మానియా హాస్సిటల్స్‌కే పరిమితమైనా మోకాలి చిప్పలు మార్పిడి చికిత్సను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ప్రారంభిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ‌దవాఖానలో ఇటీవల మోకాళ్ల చిప్పల ఆపరేషన్లు చేయించుకున్న పేషెంట్లను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వారం ఇద్దరికి సిద్దిపేట దవాఖానలో మోకాలి చిప్పలు మార్పిడి ఆపరేషన్‌ ‌చేస్తాం. ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్‌కు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని మంత్రి సూచించారు. డబ్బులు ఉన్నవాళ్లు మాత్రమే చేసుకునే మోకాలి చిప్పల మార్పిడి నేడు ప్రభుత్వ దవాఖానల్లో పేద వాళ్లకు కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. సీఎం కేసీఆర్‌ ‌కన్న కలలు నేడు నిజమవుతున్నాయని మంత్రి తెలిపారు. ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానల్లో 30 శాతం ప్రసవాలు అయితే  నేడు 56 శాతం అవుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ ‌ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీలు ఏర్పాటు చేయడం వల్లనే మోకాలు చిప్పల సర్జరీలు సాధ్యం అవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ సర్జరీలకు సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కానీ ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగానే ఈ సేవలు పొందవచ్చని మంత్రి తెలిపారు.


నిరుద్యోగులకు వెంటనే ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి : అధికారులకు మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశం
సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోని నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునే ఆదాయ, నివాసం, కుల ధృవీకరణ పత్రాలను 24 గంటల్లోనే ఇవ్వాలనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లతో మంత్రి టెలికాన్ఫరెన్స్ ‌నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో ఉన్న నిరుద్యోగులు ఆదాయ, కుల , నివాస ధృవ పత్రాలు వి• సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే ఆలస్యం అవడంతో పై చదువులకు, ఉద్యోగాల దరఖాస్తులకు ఇబ్బందులు కలుగుతుందని నా దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి ఇబ్బందులు కలగకుండా దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే సంబంధిత పత్రాలు చేతికి అందాలని అధికారులను ఆదేశించారు. వారి సమయం వృథా కాకుండా ఏ రోజుకు ఆ రోజు పత్రాలు వచ్చే విధంగా చూడాలన్నారు. వి• సేవ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా వి• సేవ కేంద్రాలను అందుబాటులో తేవాలని సూచించారు.

ఉద్యోగం కోసం అప్లై చేసే వారికి అన్నివిధాలా బాసటగా నిలవాలని చెప్పారు. ఇందుకు ఆర్డీవోలు, తహసీల్దార్లు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి. మిల్లర్స్ ‌తో సమన్వయం చేస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి అన్నారు. గన్నీ బ్యాగ్స్ ‌డ్యామెజ్‌ ‌లేకుండా ఇవ్వాలని తూకపు యంత్రాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలు కురిస్తే ధాన్యం తడవకుండా టార్పలిన్‌ ‌కవర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు అన్ని కొనుగోలు కేంద్రాలు సందర్శించి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ధరణి పోర్టల్‌లో కొత్తగా వచ్చిన సవరణలను కూడా రైతులకు అందుబాటులో ఉంచాలని మంత్రి సూచించారు.

Leave a Reply