Take a fresh look at your lifestyle.

జాబ్‌ల పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు

భారీ ప్రకటనలు తప్ప నియామకాలు ఏవీ
సిఎం జగన్‌ ‌తీరుపై మండిపడ్డ అచ్చెన్నాయుడు
అమరావతి, జూన్‌ 30 : అధికారంలోకి వస్తే ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం.. సునా సృష్టిస్తామన్న జగన్‌ ‌రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పత్రికల్లో భారీ ప్రకటనలతో జాబ్‌ ‌క్యాలెండర్‌ అం‌టూ జాబ్‌ ‌లెస్‌ ‌క్యాలెండర్‌ ‌విడుదల చేసి నిరుద్యోగుల్ని ముంచారన్నారు. మాట ఇవ్వడం మడమ తిప్పడంలో జగన్‌ ‌రెడ్డిని మించిన వారు ప్రపంచంలోఎవరూ ఉండరని, ఉండకూడదు అనేంతలా మోసం చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి అరెస్టులు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం తప్ప సాధించిందే మిటని ప్రశ్నించారు. ఉద్యోగాలివ్వకుండా మోసం చేసి.. నిలదీసిన నిరుద్యోగులపై ఏకంగా అత్యాచారం కేసులు నమోదు చేయడం తుగ్లక్‌ ‌విధానం కాకమరేమిటో చెప్పాలని నిలదీసారు.

రెండున్నర లక్షల ఉద్యోగాలి స్తామని ఊరించి రెండేళ్ల తర్వాత 10 వేల ఉద్యోగాలు, అది కూడా వచ్చే ఏడాది పాటు నోటిఫికేషన్లు ఇస్తూ పోతామనడం నిరుద్యోగుల్ని మోసం చేయడం కాదా అనిఅచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. హా అమలు చేయనందుకు నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పి ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలన్నారు. లేకుంటే ఉద్యోగార్ధులతో కలిసి టిడిపి ఆధ్వర్యంలో నిరుద్యోగుల ఉద్యమం చూడాల్సి వస్తుందని హెచ్చరిం చారు. ఉద్యోగాల పేరుతో నాడు పాదయాత్రలో, ఎన్నికల ప్రచారంలో •రెత్తించి రెండేళ్లు నోరు మెదపలేదన్నారు.

రెండేళ్ల తర్వాత కూడా నోటిఫికేషన్‌ ఇవ్వడం చేతకాలేదన్నారు. ఉద్యోగాల పేరుతో చేసిన మోసాన్ని ప్రశ్నించిన నిరుద్యోగులు, విద్యార్ధులపై అత్యాచారం కేసులు పెట్టిన ప్రభుత్వం.. దాడులు, దౌర్జన్యాలు, అత్యాచా రాలకు పాల్పడిన వైసీపీ నేతలపై కేసులు పెట్టకపోవడంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం ప్రజలపై తప్పుడు కేసులు పెట్టడమే ధ్యేయంగా పని చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ ‌లెస్‌ ‌క్యాలెండర్‌పై పున:సక్షించి ఎన్నికల హా మేరకు 2.30 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply