Take a fresh look at your lifestyle.

ఒక విద్యార్థిని నివేదన వలస కూలీల క్షోభను అర్థం చేసుకోండి

అందరికి నమస్కారం !! నేను మీ నూహరిక,
నేను మీ ముందుకు వచ్చింది మనందరికి తెలిసిన మన శత్రువు కరోనా గురించి కొన్ని విషయాలు చెప్పడానికి. కరోనా అంటె అందరికి గుర్తుకొచ్చే విషయం లాక్‌ ‌డౌన్‌. ‌లాక్‌ ‌డౌన్‌ అనగానే కతం అందరూ ‘స్టే హోమ్‌..‌స్టే సేఫ్‌’ అని నినాదాలు చెపుతూ, ఫోటోలు దిగి సోషల్‌ ‌మీడియాలో పెడ్తున్నారు. కానీ నేను మీకు చెప్పదల్చుకుంది అది మాత్రం అస్సలు కాదు. కరోనా మన దేశంలో ఉన్న ధనిక, మధ్యతరగతి మరియు పేదల మీద చూపిస్తున్న ప్రభావం గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను.ముందు మన దేశంలో ఉన్న ధనికులపై కరోనా ప్రభావం గురించి చూద్దాం. మొత్తం మన భారతీయుల జనాభా 130 కోట్లు. అందులో దనికుల జనాభా 1 శాతం. వీరందరి మీద కరోనా ప్రభావం చాలానే ఉంది. వాళ్ళు ఎప్పటిలాగా షికార్లకు, సినిమాలకు వెళ్లలేకపోతున్నారు. రోజుకు లక్షలు, లక్షలు సంపాదించలేకపోతున్నారు. దీనితో వాళ్ళ ఆర్థిక సంపాదన ఆగిపోయింది. కానీ వాళ్ళు ఇప్పటివరకు సంపాదించిన దానితో కుటుంబసభ్యులతో సుఖంగా ఉంటున్నారు.

ఇక మధ్యతరగతి వాళ్ల గురించి చూస్తే వారి జనాభా 49 శాతం. వీరి పైన కూడా కరోనా ప్రభావం తీవ్రంగానే ఉంది. ప్రతీ రోజు ఉద్యోగానికి వెళ్ళి డబ్బులు సంపాదించి నెలకొక సినిమా, మూడు నెల్ల్లకోసారి కుటుంబంతో బయటికి వెల్తూ ఆనందపడుతూ. నెల చిట్టీలు కట్టుకుంటు జీవనం సాగించే ఈ మధ్యతరగతి వాళ్ళకి వచ్చే సంపాదన ఆగిపోయింది. ఎప్పటిలాగా కాకుండా కొన్ని సరుకులు మాత్రమే తెచ్చుకొని పొదుపుగా వాడుకుంటూ సుఖంగా కాకపోయినా జీవనం గడుపుతున్నారు. ఇక మన దేశ జనాభలో సగం జనాభా పేదలు. వీరిపై కరోనా ప్రభావం వర్ణణాతీతం. ప్రతీరోజు రెక్కల కష్టం చేస్తూ వచ్చినదానితో కడుపినింపుకొనేవారంత ఇప్పుడు గంజి కూడా దొరకక పస్తులుంటున్నారు. మన దేశంలోని పేదలు చాలా మంది వలస కూలీలు. వీరంతా వేరువేరు ప్రాంతాలకు, రాష్ట్రాలకు వెళ్లి జీవనాన్ని కొనసాగించేవారే. తండ్రో చోట, భార్యాపిల్లలు ఒకచోట బ్రతుకుతున్నారు.

అవును. అందరూ ‘స్టే హోమ్‌..‌స్టే సేఫ్‌’ అం‌టున్నారు. అసలు దాని అర్థం ఏంటి? ఇంట్లోవుంటూ ఆరోగ్యంగా, సురక్షితంగా, క్షేమంగా ఉండమని. కానీ ఈ వలస కూలీలు లాక్‌ ‌డౌన్‌ ‌కారణంగా ఇల్లులేక రొడ్డుమీద పడ్డారు. ఇక వాళ్లు సంతోషంగా క్షేమంగా ఎలా ఉంటారు??????. కుటుంబానికి దూరంగా, బెంగతో, బాధతో, భవిష్యత్తు మీద భయంతో వారు బ్రతుకుతున్నారు. చాలా మంది ధనిక, మధ్యతరగతి పిల్లలు లాక్‌ ‌డౌన్‌ ‌కారణంగా వాళ్ళకి కావలసిన వస్తువులు కొనుక్కోలేపోతున్నామని గొడవ చేస్తూన్నారు. ఒక్కసారి పేదలు అనుభవిస్తున్న కష్టాలను, వారు ఒక్క పూట భోజనం కోసం పడుతున్న క్షోభను అర్థం చేసుకోవలనేదే నా ఉద్దేశం….తండ్రి కోసం ఎదురుచూసే వలసకార్మికుల కుటుంబాల పట్ల మానవత్వంతో ఉందాం…..
ధన్యవాదాలు,

nuharika k
ఇట్లు
మీ విధేయురాలు,
కె.నూహరిక.
ఇంటర్‌ ‌ఫస్ట్ ఇయర్‌
‌సూర్యాపేట

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!