కరోనా సమయంలో ఏజేన్సీలోని నిరుపేదలు ఆకలితో అలమటించకుండా కాంగ్రేస్ పార్టీ అండగా ఉంటుందని ములుగు ఎమ్మేల్యే సీతక్క అన్నారు. సోమవారం మంగపేట మండలంలోని కత్తిగూడెం,దేవనగర్‌కు చెందిన 180 మంది నిరుపేద కుటుంబాల వారికి, రాజుపేట గ్రామంలోని ఎస్సీ కాలనీ,కోత్తూరు ఉప్పర కాలనీ,విజయరావుపేటలకు చెందిన 350 నిరుపేద కుటుంబాలకు కాంగ్రేస్ పార్టీ నాయకుల సహకారంతో నిత్యావసర సరుకులను పంపణి చేశారు. ఈ సందర్బంగా ఆమే మాట్లాడుతూ ప్రజలందరు సామాజిక దూరాన్ని పాటించి కరోనా మహమ్మారీని తరిమి కోట్టాలని పిలుపు నిచ్చారు. అనంతరం మండల కేంద్రంలోని కాంగ్రేస్ పార్టీ నాయకులు ఎండి యూనిస్ జరుపుకున్న రంజాన్ వేడుకలకు హజరయ్యారు.
ఈ సందర్బంగా ముస్మీం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల రోజులు ఇంట్లోనే నమాజ్ చేసుకుని ముస్లీం సోదరులు క్రమశిక్షణ కనబరిచారన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అద్యక్షులు నల్లేల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అద్యక్షులు గోల్లపెల్లి రాజేందర్‌గౌడ్, అద్యక్షులు మైల జయరాంరెడ్డి,మాజీ జడ్పీటిసి గుమ్మడి సోమయ్య, మాజీ పిఏసిఎస్ చైర్మెన్ వల్లేపల్లి శివయ్య, జాగర్లమూడి నాగేశ్వర్రావు, కో అప్షన్ సభ్యులు యూనిస్, తుడి భగవాన్‌రెడ్డి, యూత్ కాంగ్రేస్ మండల అద్యక్షులు గౌతమ్ కుమార్, ఆయ్యోరి యాణయ్య, కోంకతి సాంబశివరావు,ముఖర్జీ పాల్గోన్నారు.