Take a fresh look at your lifestyle.

‌సీఎం జగన్‌ ‌నేతృత్వంలో… ఆంధ్రప్రదేశ్‌ ‌సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోంది

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌ : ఆం‌ధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్నదని ప్రభుత్వ జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారు, దేవులపల్లి అమర్‌ అన్నారు. జగన్‌ ‌నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నవరత్నాలు పథకం రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ చేరుతున్నదనీ, సంక్షేమ, అభివృద్ధి పథకాలతో లబ్దిదారులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. శనివారం 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని ఏపీ సీఎం క్యాంపు కార్యాలయమైన లేక్‌వ్యూ అతిధి గృహంలో అమర్‌ ‌జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన అమరులకు నివాళి అర్పించారు.

Government National Media, International Affairs Advisor, Devulapalli Amar

ఈ సందర్భంగా అమర్‌ ‌మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్‌ ‌నేతృత్వంలో అమలు చేస్తున్న నవరత్నాలు పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతీ నిరుపేదకూ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ప్రతీ నెలా కచ్చితంగా నిర్దేశించిన సమయానికే అర్హులైన లబ్దిదారులందరికీ ఇంటికి చేరుతున్నాయని పేర్కొన్నారు.అలాగే, ప్రభుత్వం చేపట్టిన వ్యాధి నిర్ధారణ,నియంత్రణ,బాధితులకు వైద్య చికిత్సలు అందించడంతో పాటు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల కారణంగా కోవిడ్‌ 19‌ను ఎదుర్కోవడంలో ఏపీ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలచిం దన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ సలహాదారు లంక శ్రీధర్‌, ‌లేక్‌వ్యూ అతిధి గృహం ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply