Take a fresh look at your lifestyle.

‌ట్రిపుల్‌ ‌తలాఖ్‌ ‌చెప్పి చెక్కేసే యత్నం

‌బెంగళూరు, ఫిబ్రవరి 13 : తన భార్యకు ట్రిపుల్‌ ‌తలాఖ్‌ ‌చెప్పినందుకు 40 ఏళ్ల వైద్యుడిని బెంగళూరు విమానాశ్రయంలో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని కళ్యాణ్‌ ‌పురికి చెందిన ఓ డాక్టర్‌ ‌తన భార్యకు అక్టోబర్‌ 13, 2022‌లో ట్రిపుల్‌ ‌తలాఖ్‌ ‌చెప్పాడు. అయితే ఇటీవల అతని భార్య పోలీసులను సంప్రదించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆ డాక్టర్‌ ‌ఫిబ్రవరి 9న బెంగళూరు నుంచి యూకేకు పారిపోయేందుకు యత్నించాడు.

ఈ నేపథ్యంలోనే  బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు అతన్ని ఢిల్లీ అరెస్టు చేశారు. అయితే తన భార్యకు ట్రిపుల్‌ ‌తలాఖ్‌ ‌చెప్పినందుకే  పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. కాగా భాధితురాలి గుర్తింపును కాపాడేందుకు వారిద్దరి పేర్లను పోలీసులు వెల్లడించలేదు. కానీ అతనిపై ఐపీసీ సెక్షన్‌ 323 ‌కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్టు మాత్రం పోలీసులు స్పష్టం చేశారు.

Leave a Reply