Take a fresh look at your lifestyle.

మరో ప్రపంచ యుద్ధాన్ని ఐరాస నివారించాలి

సెప్టెంబర్‌ 21… అం‌తర్జాతీయ శాంతి దినోత్సవం

United Nations ఐక్య రాజ్య సమితి దేశాలన్నీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 21 ‌తేదీన అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరుపుకుంటాయి. అంతర్జాతీయంగా కాల్పుల విరమణ, అహింస, శాంతి, సోదరభావాల సాధన కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. 1981లో సెప్టెంబర్‌ 21‌న ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం ప్రారంభ సందర్భంగా కోస్టారికా సమర్పించిన తీర్మానం ప్రకారం ప్రతి ఏటా సెప్టెంబర్‌ 21‌ని ప్రపంచ శాంతి దినంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ప్రకటించింది. తొలి ప్రపంచశాంతి దినాన్ని 1982 సెప్టెంబర్‌లో నిర్వహించారు. 2002లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సెప్టెంబర్‌ 21‌వ తేదీని అంతర్జాతీయ శాంతి దినోత్సవ నిర్వహణకు శాశ్వత తేదీగా ప్రకటించడం జరిగింది.

ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. 20వ శతాబ్దం మానవాళిని అతలాకుతలం చేసింది. 1930 నాటి మహామాంద్యం వల్ల ఐరోపాలో నియ ంతలు అధికార పీఠాలు అధిరోహించారు. ఆపై సంభవించిన రెండో ప్రపంచ యుద్ధం, మానవాళి చరిత్రనే రక్తాక్షరాలతో లిఖించింది. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఒక బహుముఖీన అంతర్జాతీయ సంస్థ అవసరమని ప్రపంచ నాయకులు భావిం చారు. ఆ భావనకు ఒక రూపం కల్పిం చారు. తరవాత అదే ఐక్యరాజ్య సమితిగా ఆవిర్భ వించింది. నానాజాతి సమితి(లీగ్‌ ఆఫ్‌ ‌నేషన్స్) ‌రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారి ంచుటలో విఫల మగుటచే దానికి ప్రత్యా మ్నాయంగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపిం చబడింది. ప్రతి సభ్య దేశమూ ఐ.రా.స. సాధా రణ సభలో సభ్యత్వం కలిగి ఉంటుంది. ఐ.రా.స. చార్టర్‌ 2‌వ ఛాప్టర్‌ 4‌వ ఆర్టికిల్‌ ‌ప్రకారం ఏదైనా దేశానికి ఐ.రా.స. సభ్యత్వం రావాలంటే ఐ.రా.స. భద్రతా సభ ఆమోదంపై, ఐ.రా.స. సాధారణ సభ తీర్మానం జరగాలి.

నియమాల ప్రకారం సంపూర్ణ స్వాధిపత్యం ఉన్న దేశాలు మాత్రమే సభ్యత్వానికి అర్హత కలిగి ఉంటాయి. కాని ఐ.రా.స. ఏర్పాటు సమయంలో చేరిన నాలుగు ఆరంభ సభ్య దేశాలకు(బెలారస్‌, ‌భారత దేశం, ఫిలిప్పీన్స్, ఉ‌క్రెయిన్‌) అప్పటికి సంపూర్ణ స్వాతంత్య్రం లేదు. అంతే కాకుండా భద్రతా సభ ఆమోదం ఉండాలన్న నిబంధన కారణంగా మాంటివిడియో కన్వెన్షన్‌ ‌ప్రకారం స్వాధిపత్యం కలిగిన కొన్న దేశాలు కూడా, మరి కొన్ని ఐ.రా.స. సభ్య దేశాలు వ్యతిరేకించిన కారణంగా ఐ.రా.స. సభ్యత్వం కలిగి లేవు. 1945లో ఐ.రా.స. ఏర్పడినప్పుడు 51 మంది సభ్య దేశాలున్నాయి. వాటిలో 49 దేశాలు ఇప్పటికీ సభ్యులుగా ఉన్నాయి. లేదా వారి సభ్యత్వం వేరే దేశాలకు సంక్రమించింది. ఉదాహరణకు సోవియట్‌ ‌యూనియన్‌ ‌సభ్యత్వం రష్యాకు సంక్రమించింది. ప్రస్తుతము 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతా మండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు అమెరికా, రష్యా, బ్రిటన్‌, ‌చైనా, ఫ్రాన్స్ ‌శాశ్వత సభ్య దేశాలు. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ ‌నగరంలో ఉంది. దీని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుట్టెర్స్. ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన అక్టోబరు 24వ తేదీని ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్స వంగా పాటిస్తారు.

Second World War రెండవ ప్రపంచ యుద్ధం జరుగు తున్న సమయంలోనే 1941 ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు థియోడార్‌ ‌రూజ్‌వెల్ట్, ‌బ్రిటిష్‌ ‌ప్రధాని విన్‌స్టన్‌ ‌చర్చిల్‌ అట్లాంటిక్‌ ‌సము ద్రంలో ఒక ఓడలో సమావేశమై కుదుర్చుకొన్న ఒప్పందాన్ని అట్లాంటిక్‌ ‌ఛార్టర్‌ అం‌టారు. ప్రాదేశిక సమగ్రత కాపాడడం, యుద్ధభయాన్ని తొలగించడం, శాంతిని నెలకొల్పడం, నిరాయుధీకరణ వంటి ఎనిమిది అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ ఒప్పందమే తరువాత ఐక్యరాజ్య సమితి సిద్ధాంతాలకు మౌలిక సూత్రాలుగా గుర్తింపు పొందినది. తరువాత 1944లో వాషింగ్టన్‌ ‌లోని డంబార్టన్‌ ఓక్స్ ‌వద్ద జరిగిన సమావేశంలో అమెరికా, బ్రిటన్‌, ‌రష్యా ప్రతినిధులు ఐ.రా.స. ప్రకటన పత్రం ముసాయిదాను తయారు చేశారు. 1945 ఫిబ్రవరిలో యాల్టా సమావేశంలో అమెరికా, బ్రిటన్‌, ‌రష్యా నేతలు ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం ఒక అంతర్జాతీయ సంస్థను స్థాపించాలని తీర్మానం చేశారు. శాన్‌ ‌ఫ్రాన్సిస్కో నగరంలో 1945 ఏప్రిల్‌ 25 ‌నుండి జూన్‌ 26 ‌వరకు జరిగిన అంతర్జాతీయ సమావేశంలో 51 దేశాల ప్రతినిధులు పాల్గొని ఐక్య రాజ్య సమితి ఛార్టర్‌పై సంతకాలు చేశారు. 1945 అక్టోబరు 24న New York City న్యూయార్క్ ‌నగరంలో ఐక్య రాజ్య సమితి లాంఛనంగా ప్రారంభమైంది. యుద్ధాలు జరగకుండా చూడటం, అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం, దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడం, అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించేటట్లు చేయడం, సాంఘిక అభివృద్ధి సాధించి, మానవ జీవితాలను సుఖమయం చేయడం తదితరాలు సమితి ఆశయాలు. అప్పటి US President Franklin Roosevelt అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ ‌రూజ్‌వెల్ట్ United Nations ‘‌యునెటైడ్‌ ‌నేషన్స్’ అనే పదాన్ని తొలిసారి ప్రవేశ పెట్టాడు.

ఐక్యరాజ్య సమితికి 6 ప్రధానాంగాలు… సర్వ ప్రతినిధి సభ, సచివాలయం, ధర్మకర్తృత్వ మండలి, ఆర్థిక, సాంఘిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం . ఐక్యరాజ్య సమితి స్థాపించిన నాటి నుండి నేటి వరకు 76 సంవత్సరాల కాలంలో ప్రపంచ శాంతికి దోహదం చేసే ఎన్నో కార్యకలాపాలను నిర్వహించింది. ఐతే ప్రపంచాన్ని వణికిస్తున్న తీవ్రవాదాన్ని నివారించడంలో సమితి విఫలం అయ్యింది. ఐక్యరాజ్య సమితిలోని అగ్ర రాజ్యాల ఆధిపత్యం కొనసాగుతుండటం చిన్న దేశాలకు శాపంగా మారుతున్నది. అగ్ర రాజ్యాల చేతిలో ఉన్న ఐరాస తన లక్ష్యాలను నెరవేర్చలేక పోతున్నది. కాలం గడుస్తున్న కొద్దీ ఐరాస బలహీన పడుతున్నదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 76 ఏళ్ళ పాటు ప్రపంచ శాంతికి అవిరళమైన కృషి చేసిన ఐరాస మరో ప్రపంచ యుద్ధం రాకుండా చూడాలి. ఆ దిశగా కృషి చేస్తూ, మానవాళిని కాపాడ గలదని మనసారా ఆశిద్దాం.
– రామ కిష్టయ్య సంగన భట్ల, 9449595494

Leave a Reply