Take a fresh look at your lifestyle.

ఓ ‌నిరుద్యోగి తస్మాత్‌ ‌జాగ్రత్త……!

ప్రతిసారి  ఎన్నికల సమయంలో మోసపోతూనే ఉన్నావు. ఈ ఎన్నికల సమయంలో కూడా మోస పోవడానికి సిద్ధంగా ఉండకండి. రాష్ట్రంలో జోనల్‌ ‌విషయ..విధానం పరిష్కరించకుండా ఉద్యోగుల భర్తీ అసాధ్యం. టెట్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించకుండా ఉపాధ్యాయ ఉద్యోగుల నియామకాలను భర్తీ చేయడం అసాధ్యం. కేవలం రాష్ట్రంలో జరుగబోయే శాసన మండలి ఎన్నికలు, నాగార్జునసాగర్‌ ‌శాసనసభ ఉప ఎన్నిక, వరంగల్‌, ‌కరీంనగర్‌, ‌ఖమ్మం మున్సిపాలిటీల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగులను మోసం చేసే కుట్ర పనిలో ప్రభుత్వం ఉంది.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఇచ్చిన వాగ్దానాలు, నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో మాట మరిచిన విధంగానే ప్రభుత్వం ప్రతిసారి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలను విజయం సాధించిన తర్వాత మరిచిపోతున్నారు…. తస్మాత్‌ ‌జాగ్రత్త..ఓ నిరుద్యోగ యువతీ యువకులూ.
– నరేష్‌ ‌జాటోత్‌. ఎం ఏ. ‌బిఈడి.కాకతీయ విశ్వవిద్యాలయం (8247887267)

Leave a Reply