Take a fresh look at your lifestyle.

20 ఏళ్ల అనంతరం.. అఫ్ఘాన్‌ ‌నుంచి నిష్క్రమించిన అమెరికా బలగాలు

  • ఖతార్‌ ‌నుంచి దౌత్యసంబధాలు కొనసాగుతాయన్న అమెరికా విదేశాంగ శాఖ
  • అమెరికా దళాలు వీడడంతో అఫ్టాన్‌కు పూర్తి స్వాతంత్య్రం: తాలిబన్‌లు

గత 17 రోజులుగా అప్గనిస్తాన్‌లో తమ బలగాలు చేపట్టిన పౌరుల తరలింపు పక్రియ అమెరికా చరిత్రలోనే అతి పెద్దదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ‌వ్యాఖ్యానించారు. సుమారు 1,20,000 వేల మంది అమెరికా పౌరులు, అమెరికా-అప్గన్‌ ‌మిత్ర దేశాల ప్రజలను తరలించినట్లు పేర్కొన్నారు. అప్గన్‌లో అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తయిన నేపథ్యంలో జో బైడెన్‌ ‌తాజాగామిడియాతో మాట్లాడారు. 20 ఏళ్లుగా అమెరికా సైన్యం అప్గనిస్తాన్‌లో అందిస్తున్న సేవలు నేటితో ముగిసాయి. ముందుగా నిర్దేశించిన ప్రకారం ఆగష్టు 31, వేకువజాము లోపే.. ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా.. అత్యంత సురక్షితంగా ఈ ప్రమాదకరమైన ఆపరేషన్‌ ‌పూర్తి చేసిన మా కమాండర్లకు ధన్యవాదాలు చెబుతున్నానని బైడెన్‌ ‌పేర్కొన్నారు. అయితే ఇప్పటితో తరలింపు పక్రియ పూర్తయినట్లు కాదని, అంతర్జాతీయ భాగస్వాములు, మిత్రదేశాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని తమ విదేశాంగ మంత్రికి చెప్పినట్లు బైడెన్‌ ‌తెలిపారు. అప్గనిస్తాన్‌ను వీడాలనుకుంటున్న అమెరికన్లు, అప్గన్‌, ఇతర విదేశీ పౌరులను సురక్షితంగా అక్కడి నుంచి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించాను.

ఇందుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం జరుగనుందని పేర్కొన్నారు. అప్గనిస్తాన్‌ను వీడాలనుకున్న పౌరులను సురక్షితంగా తరలిస్తామని తాలిబన్‌లు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా బైడెన్‌ ‌గుర్తుచేశారు. ఇకపోతే అప్గనిస్తాన్‌ ‌నుంచి తమ సేనల ఉపసంహరణతో దౌత్యపరంగా తాము అక్కడి నుంచి నిష్క్రమించిన్లటైందని, ఇక నుంచి దౌత్య సంబంధాలను ఖతార్‌ ‌నుంచి నిర్వహిస్తా మని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ అన్నారు. అంతర్జాతీయ ప్రయాణాలపై తాలిబన్‌లు ఆంక్షలు విధించవద్దని, మహిళలు, మైనార్టీ హక్కులను కాలరాసేలా వ్యవహరించకూడదని హితవు పలికారు. అలాగే ఉగ్రవాదాన్ని పెంచి పోషించే చర్యలకు తావివ్వకూడదని విజ్ఞప్తి చేశారు.

అమెరికా దళాలు వీడడంతో అఫ్టాన్‌కు పూర్తి స్వాతంత్య్రం: తాలిబన్‌లు
తాలిబన్ల వశమైన అఫ్గానిస్థాన్‌లో అమెరికా బలగాల ఉపసంహరణ ముగియడంతో అఫ్గాన్‌కు పూర్తి స్వాతంత్య్రం వొచ్చిందని తాలిబన్‌లు ప్రకటించారు. తుపాకులతో గాలిలో కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. అమెరికా సైనిక బలగాల చివరి విమానం సోమవారం అర్థరాత్రి ఆఫ్ఘన్‌ను వీడగానే తాలిబన్‌లు సంబురాలు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ‌విధించిన ఆగష్టు 31 గడువు తేదీలోపే అమెరికా దళాలు ఆఫ్ఘన్‌ను ఖాళీ చేశాయి.

Leave a Reply