Take a fresh look at your lifestyle.

కొరోనాతో నష్టపోయిన కార్మికులను ఆదుకోవాలి

కొరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన కార్మికులను, వడగల్లతో నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు డిమాండ్‌ ‌చేశారు. సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వలస కార్మికులు, ఆ సంఘటిత కార్మికులు, చేతివృత్తి దారులు, వడగల్లతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఒక్క రోజు దీక్షలు చేపట్టారు. హన్మకొండ బాల సముద్రంలోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని వారిని ఆదుకోవడంలో కేంద్రానికి చిత్తశుద్ది లేదన్నారు. ఆర్థిక నేరగాళ్ళ ఉన్న శ్రద్ద వలస కార్మికులపై కేంద్రానికి లేదన్నారు.

కార్పోరేట్‌ ‌వర్గాలకు మేలు చేకూరేలా రూ.69వేల కోట్ల రుణాలు బ్యాంకు ఎగవేత దారులకు రద్దు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. వలస కార్మికులు రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేస్తున్న వారిని స్వస్థలాలకు పంపడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయన్నారు. వడగాల్ల వాన, మరోవైపు మిల్లర్ల మాయతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ద వహించడం లేదన్నారు. అలాగే ప్రైవేట్‌ ‌సంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులకు యాజమాన్యాలు వేతనాలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాయని ప్రభుత్వం జోక్యం చేసుకుని వేతనాలు ఇప్పించాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి మద్దెల ఎల్లేష్‌ ‌ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ అ సంఘటిత కార్మికులను ఆదుకోవాలన్నారు. ఈ దీక్షలలో సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా నాయకులు నరేష్‌, ‌ద్రవిడ్‌, ‌గుండె బద్రి, కొట్టెపాక రవి, సిపిఐ కాజిపేట మండల కార్యదర్శి మనగాల భిక్షపతి, బోట్టు భిక్షపతి, రాంపూర్‌ ‌గ్రామ శాఖ కార్యదర్శి మునిగాల నర్సింహ, మునిగాల యాదగిరి, కోయడ కుమార్‌, ఇమ్మడి శ్యామ్‌ ‌సుందర్‌, ‌వెంకటయ్య, రాజమణి, సర్వణలత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply