Take a fresh look at your lifestyle.

ఇద్దరు ఆదివాసీ బిడ్డలను హతమార్చారు

*ములుగు ఎన్‌కౌంటర్‌ ‌పై మావోయిస్టుల  ప్రకటన విడుదల
జిల్లాలోని మంగపేట అటవీప్రాంతంలో జరిగిన ఘటనపై ఓ వైపు పోలీసులు మరింతజోరుగా కూంబింగ్‌ ‌జరుపుతున్నారు. గత కొన్ని రోజులుగా అడవుల్లో కూంబింగ్‌ ‌నిర్వహిస్తున్నారు..కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమైనట్లు పోలీసులు అధికారికంగా కూడా వెల్లడించారు. అయితే ఈ ఘటనపై తాజాగా మావోయిస్టులు స్పందించారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కార్యదర్శి వెంకటేష్‌ ‌మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనను విడుదల చేశారు. ములుగు జిల్లా మంగపేట మండలం ముసలమ్మ గుట్ట వద్ద జరిగిన ఎదురుకాల్పులు దొంగ కాల్పులు అని మావోయిస్ట్ ‌పార్టీ మండిపడింది. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం  మరో ఇద్దరు ఆదివాసి బిడ్డలను హత్య చేసింది. ఈ హత్యలను ప్రజలు ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలి. హక్కుల సంఘాలు నిజనిర్దారణ చేసి పైకోర్టుల ద్వారా న్యాయ విచారణ చేపట్టి.. హత్యలకు పాల్పడిన పోలీసులను కఠినంగా శిక్షించాలి.మావోయిస్టుల అజెండాతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కొనసాగిస్తున్న మారణహోమాన్ని ఆపే వరకు తెలంగాణ ప్రజలు ప్రజాస్వామిక వాదులు వివిధ పార్టీల ప్రజా సంఘాల వారు ప్రతిఘటించాలని పోరాడాలని పిలుపునిస్తున్నాం. బూటకపు ఎన్‌కౌటర్లు చేస్తున్న టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పౌర హక్కులను కాలరాస్తూ.. నిరంకుశ పాలనను కొనసాగిస్తున్నారు’ అని ప్రకటనలో మావోయిస్టు  పార్టీ కార్యదర్శి మండిపడ్డారు

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply