ఇప్పుడు కొరోనా కంటే ఎక్కువ టెన్షన్ పెడుతున్న కొత్త స్ట్రెయిన్ కేసులు తెలుగు రాష్ట్రాల్లోనూ నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. యూకేలో మొదలై ప్రపంచదేశాలకు పాకుతోన్న ఈ వైరస్ ఇప్పుడు.. భారత్‌ను కూడా కలవరపెడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో రెండు కేసులు వెలుగు చూడగా.. ఏపీలో ఓ కేసు నమోదు అయ్యింది.
యూకే నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వొచ్చిన వారిలో 11 మందికి కొరోనా పాజిటివ్‌గా నిర్దారణ కాగా యూకే స్ట్రెయిన్ కలిగిన కొరోనాగా వైద్యులు నిర్దారించారు. రాజమండ్రికి చెందిన యూకే రిటర్నీకి యూకే స్ట్రెయిన్ సోకినట్టుగా గుర్తించారు. అయితే, మిగతా 10 మందిలో యూకే స్ట్రెయిన్ ఆనవాళ్లు మాత్రం కనిపించడంలేదని చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఒకే కేసు ఏపీలో కలవరం సృష్టిస్తోంది. అప్రమత్తమైన అధికారులు ఇప్పటికే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని జిల్లాల అధికారులకు కీలక సూచనలు చేశారు. కాగా, యూకే రిటర్నస్లో ఇప్పటి వరకు ఆరుగురికి కొరోనా కొత్త స్టెయ్రిన్ నిర్దారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.