Take a fresh look at your lifestyle.

మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి

  • పోలీసులకు లొంగిపోయిన ఇద్దరు మిలీషియా, గ్రామకమిటి సభ్యులు
  • విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన భద్రాచలం ఏఎస్పీ డా.వినీత్‌

దుమ్ముగూడెం,ఆగస్టు 04 (ప్రజాతంత్ర విలేకరి) : మావోస్టులారా జనజీవన స్రవంతిలో కలవండి.తెలంగాణ పోలీస్‌ ‌మీకు అన్ని విదాలా సహాయ సహకారాలు అందిస్తుంది అంటూ భద్రాచలం ఏఎస్పీ వినీత్‌ ‌పిలుపునిచ్చారు. సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మిలీషి•యా సభ్యులతో పాటు గ్రామ కమిటీ సభ్యుడు దుమ్ముగూడెం పోలీసుల ముందు లొంగి పోయారు. దీనికి సంబందించిన వివరాలను బుదవారం పోలీస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. మండల పరిధిలోని ములకనాపల్లి గ్రామ సరిహద్దులో చత్తీస్‌ఘడ్‌ ‌రాష్ట్రానికి చెంది కొంత మంది గొత్తి కోయ కుటుంబాలు 30 ఏళ్ల క్రితం వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని వ్యవశాయ పనులు, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామానికి చెందిన మడకం మారయ్య అనే 60 ఏళ్ల గిరిజనుడు చిన్ననాటి నుండి మావోయిస్టు పార్టీకి సానుభూతిపరుడిగా ఉంటూ వారికి రహస్యంగా అన్ని విదాలా సహాయ సహకారాలు అందించే వాడు. మావోయిస్టు పార్టీ పట్ల ఉన్న సానుభూతితో తన రెండవ కుమార్తె అయినటువంటి మడం కోసి (అలియాస్‌) ‌రజితను చిన్నతనం నుండే మావోయిస్టు కార్యకలాపా లపై మక్కువ పెంచి కుమార్తెను మావోయిస్టు పార్టీలోకి పంపాడు. ప్రస్తుతం రజిత చర్ల ఎల్‌ఓఎస్‌ ‌కమాండర్‌ ‌గా భాద్యతలు నిర్వహిస్తోంది.

ఇటీవల మావోస్టులు ఎక్కువ మొత్తంలో సరుకులు, డబ్బులు వసూలు చేయాలని ఒత్తిడి తేవడంతో పాటు మహిళలు, చిన్నపిల్లలు తన కూతురును సైతం పీడిస్తూ హింసిస్తున్నారని వారి పద్దతుల నచ్చక మారయ్య పోలీసుల ముందు తన ఆవేదన చెప్పడంతో పాటు తన కూతురు చర్ల ఎల్‌ఓఎస్‌ ‌కమాండర్‌ ‌రజితను సైతం దళం నుండి బయటకు రావాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. అదే గ్రామానికి చెందిన మడకం పాండు, మడకం చుక్కమ్మలు ఏడాదిన్నర క్రితం గ్రామంలోకి దళ సభ్యులు రాగా మారయ్య వారిని సైతం ప్రోత్సహించడంతో మిలిషియా సభ్యులుగా కొనసాగుతున్నారు. మావోస్టులు పెట్టే భాధలు తట్టుకోలేక గ్రామ పెద్ద మారయ్యతో కలిసి వచ్చి పాండు, చుక్కమ్మలు పోలీసుల ముందు లొంగి పోయినట్లు ఏఎస్పీ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని , యువతలో నైపుణ్యాలు పెంచేందుకు క్రీడలు, కరోనా సమయంలో గిరిజన గ్రామాల ప్రజలకు నిత్యవసరాలు, దోమ తెరలు, వాటర్‌ ‌ఫిల్టర్స్ ‌వంటివి అందజేయడంలో తెలం గాణ పోలీస్‌ ‌ముందు ఉందని ఆయన అన్నారు. ఈ సందర్బంగా లొంగి పోయిన మిలీషియా సభ్యులకు ఏఎస్పీ చేతుల మీదుగా కొంత నగదు అందజేశారు. ఈ సమావేశంలో సిఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు, 141 బెటాలియన్‌ అసిస్టెంట్‌ ‌కమాండెంట్‌ ‌రేవతి, ఎస్‌ఐలు సత్యనారాయణ, రవికుమార్‌, ఏఎస్‌ఐ ‌సత్యనారా యణ తదితరులు ఉన్నారు.

Leave a Reply