Take a fresh look at your lifestyle.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

‌ట్రాక్టర్‌ ‌బోల్తా పడి ఒకరు..లారీ ఢీకొని స్కూటరిస్టు..
పలువురికి తీవ్రంగా గాయాలు
నిర్మల్‌ ‌జిల్లాలో ట్రావెల్‌ ‌బస్సు బోల్తా పడి 17మందికి గాయాలు

ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. నగరంలోని అల్వాల్‌ ‌ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. నిర్మల్‌ ‌జిల్లాలో ప్రైవేట్‌ ‌ట్రావెల్‌ ‌బస్సు బోల్తాపడింది. ఇక వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలంలో ట్రాక్టర్‌ ‌బోల్తాపడి ఘోర ప్రమాదం జరిగి ఒకరు మృతి  చెందారు. నేలకొండపల్లి మండలంలోని మంగాపురం తండా వద్ద మహిళా కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ ‌బోల్తా పడింది. దీంతో ఒకరు మృతిచెందగా, ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను నేలకొండపల్లి దవాఖానకు తరలించారు. పత్తి తీసేందుకు మంగాపురం నుంచి గండ్రాయి వెళ్తుండగా అదుపుతప్పి ట్రాక్టర్‌ ‌బోల్తా పడిందని పోలీసులు చెప్పారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 20 మంది కూలీలు ఉన్నారని వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌ ‌నగరంలోని అల్వాల్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో గల కరీంనగర్‌ ‌రాజీవ్‌ ‌రహదారి హకీంపేటలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. తుంకుంటా వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మల్‌ ‌జిల్లాలోని కొండాపూర్‌ ‌బైపాస్‌ ‌వద్ద భారీ ప్రమాదం తప్పింది. నిర్మల్‌ ‌గ్రాణ పరిధిలోని కొండాపూర్‌ ‌బైపాస్‌ ‌వద్ద ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. 80 మంది ప్రయాణికులతో ట్రావెల్స్ ‌బస్సు హైదరాబాద్‌ ‌నుంచి ఉత్తరప్రదేశ్‌ ‌వెళ్తున్నది. బుధవారం తెల్లవారుజామున కొండాపూర్‌ ‌వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 17 మంది తీవ్రంగా గాయపడగా, మరో 15 మందికి స్వల్పంగా దెబ్బలు తగిలాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను నిర్మల్‌ ఏరియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply