వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి స్టేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం నాడు బైక్‌ను ఢీ కొట్టిన ఆర్టీసి బస్సు అక్కడిక్కడే ఇద్దరు మృతి చెందారు. వివరాలలోకి వెళితే వీపనగండ్ల మండలం వైన్ షాపులో రేజువారిగా కలీ పనినిమ్మిత్తం వైన్స్ లో పనిచేయడం కోసం వెళుతుండగా అతి వేగంగా పెబ్బేరు నుంచి కొల్లాపూర్ వస్తున్న ఆర్టీసి బస్సు టిఎస్ 06 జడ్ 0162 నెంబర్ బస్సు ఢీ కొట్టడంతో లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన ఎరుకలి గురువయ్య (36) భాస్కర్‌గౌడ్ (48) అక్కడిక్కడే మృతి చెందారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.ఈ ఘటనపై పోలీసులు కోసు నమోదు చేసుకొని విచారణ చేపడతామని తెలిపారు.