Take a fresh look at your lifestyle.

ఇద్దరు హైకోర్టు న్యాయవాదుల దారుణ హత్య ..

  • గుంజపడగ టీఆర్‌ఎస్‌ ‌నాయకుడు కుంట శ్రీను హత్యకు పాల్పడినట్లు వామన్‌రావు వాంగ్మూలం ..
  • హత్యను తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి శ్రీధర్‌బాబు
  • నిందితుల కోసం ప్రత్యేక బలగాలతో గాలింపు చర్యలు చేపట్టామని సీపీ వెల్లడి ..

పెద్దపల్లి జిల్లాలో బుధవారం దారుణ హత్య జరిగింది. జిల్లా కేంద్రానికి సమీపంలోని రామగిరి మండలంలోని కల్వచర్ల పెట్రోల్‌ ‌బంక్‌ ‌వద్ద హంతకులు దారికాసుకొని వుండి పథకం ప్రకారం హత్య చేశారు. హైదరాబాద్‌ ‌నుంచి వస్తున్న హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, ఆయన భార్య నాగమణిలపై కారు ఆపి దుండగులు కత్తులతో జరిపిన దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పొయారు. ఈ ప్రాంతంలో ఒక అడ్వకేట్‌పై హత్యకు పాల్పడటం ఇదు మొదటిసారి కావడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొని వుంది. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో దారికాసి వున్న దుండగులకు పథకం ప్రకారం సమాచారం రావడంతో కారు నంబర్‌ను గుర్తించిన ఇద్దరు దుండగులు కారును అడ్డగించడంతో కారు ఆపగా, కారులో ప్రయాణీస్తున్న గట్టు వామన్‌రావుపై కత్తులతో దాడి చేసి రోడ్డు మీదనే అందరు చూస్తుండగానే కత్తులతో నరికి చంపారు.

నడి రోడ్డుపై రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వామన్‌రావు పరిస్థితిని చూసి రోడ్డుపై ప్రయాణీస్తున్న బస్‌ ‌ప్రయాణీకులు అక్కడ వున్న ప్రత్యక్ష సాక్షులు 108 అంబులెన్స్‌కు ఫోన్‌ ‌చేయడంతో ఇద్దరు రక్తపు మడుగులో మునిగిన వారు ఇద్దరు దావఖానకు చేరకముందే తుదిశ్వాస విడిచారు. కారులోనే వెనుక సీటులో కూర్చున్న వామన్‌రావు భార్య నాగమణి అనే హైకోర్టు అడ్వకేట్‌ను కారులో పొడిచి గాయపర్చడంతో స్రృహతప్పి పోయింది. ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలం తరువాత గతంలో ఎన్నడు జరుగని విధంగా నడిరోడ్డుపై కారు ఆపి పట్టపగలే న్యాయవాదులను దారుణ హత్యకు పాల్పడటం ఈ ప్రాంతంలో ప్రజలు భయాందోళనలో వున్నారు. కాగా, రక్తపు మడుగులో వున్న వామన్‌రావు చివరి మాటగా తనపై హత్యకు పాల్పడింది గుంజపడగ గ్రామానికి చెందిన నాయకుడు, మంథని టీఆర్‌ఎస్‌ ‌మండల అధ్యక్షులు కుంట శ్రీను అనుచరులతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వామన్‌రావు తెలిపారు.

నిందితులను వదిలేది లేదు: రామగుండం సీపీ సత్యనారాయణ
హత్యకు పాల్పడిన వ్యక్తులు ఎంతటివారైన ఉపేక్షించేది లేదని రామగుండం పోలీసు కమిషనర్‌ ‌వి.సత్యనారాయణ తెలిపారు. నిందితుల కోసం ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్టు సీపీ పేర్కొన్నారు. నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.

శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి: మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు
పెద్దపల్లి జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. తమ సన్నిహితుడు, హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. వామన్‌రావు తమకు ప్రాణహాని వుందని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. చట్టానికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ ‌నాయకులు హత్యారాజకీయాలు చేస్తూ.. భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని తెలిపారు. గట్టు వామన్‌రావు దంపతులను అతి కిరాతంగా నరికి చంపిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply