Take a fresh look at your lifestyle.

ఏసిబికి చిక్కిన ఇద్దరు మత్స్యశాఖ అధికారులు

ఒకరు రూ 40 వేలు, ఇంకొకరు రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత 

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో మహిళా మత్స్యకార సంఘం సొసైటీ ఏర్పాటుకు రూ 50 వేలు డిమాండ్‌ ‌చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యశాఖ డిప్యూటి డైరెక్టర్‌ ‌ఖదీర్‌ అహ్మద్‌, ‌సీనియర్‌ అసిస్టెంట్‌ అం‌జయ్యలను ఏసిబి అధికారులు బుధవారం రెడ్‌ ‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఈ సొసైటీ ఏర్పాటుకు ఈ ఇద్దరు అధికారులు జనార్ధన్‌ అనే వ్యక్తినుండి రూ 50 వేలు డిమాండ్‌ ‌చేయగా అతను ఏసిబి అధికారులకు సమాచారం ఇచ్చారు.

కరీంనగర్‌లో ఉన్న మత్స్యశాఖ డిప్యూటి డైరెక్టర్‌ ‌ఖదీర్‌ అహ్మద్‌ ‌రూ.40 వేలు తీసుకుంటుండగా, సిరిసిల్లలో రూ. 10 వేలు తీసుకుంటుండగా సీనియర్‌ అసిస్టెంట్‌ అం‌జయ్యలను ఏసిబి అధికారులు పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏసిబి అధికారులు వెల్లడించారు.

Leave a Reply