నేడు ప్రకటించనున్న ప్రభుత్వం
వచ్చే సోమ, మంగళవారాల్లో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటు హైకోర్టు సూచించిన మరికొన్ని అంశాల్లో చట్టాలు చేయాల్సి ఉంది. దీని కోసం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. శుక్రవారం ఈ విషయంలో తుదినిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
నవంబర్ లేదా డిసెంబర్ చివరి వారంలోగా జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా ఇదివరకే పూర్తి చేసింది. ఈ ఎన్నికల్లో బ్యాటెట్ బాక్స్‌తో ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. ఈ ఎన్నికలు నిర్వహించాలంటే కొన్ని చట్టాలను కూడా ప్రభుత్వం చేయాల్సి ఉంది. అందుకే రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే.