Take a fresh look at your lifestyle.

రెండు కోట్ల మార్కును దాటిన కేసులు

  • కొత్తగా 3,57,229 పాజిటివ్‌ ‌కేసులు నమోదు
  • అమెరికా తరవాత అత్యధిక కేసులు మనవద్దే
  • దేశంలో ఆగని కొరోనా ఉధృతి..

దేశంలో కొరోనా పాజిటివ్‌ ‌కేసులు రెండు కోట్ల మార్క్‌ను దాటగా.. వరుసగా మూడో రోజు కేసులు కాస్త తగ్గాయి. 24 గంటల్లో 3,57,229 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయని కేంద్రం కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కొత్తగా 3,449 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు విడిచారు. తాజాగా 3,20,289 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 2,02,82,833కు పెరిగింది. ఇప్పటి వరకు 1,66,13,292 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మొత్తం 2,22,408 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 34,47,133 యాక్టివ్‌ ‌కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు టీకా డ్రైవ్‌లో భాగంగా 15,89,32,921 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.

నిన్న ఒకే రోజు 16,63,742 టెస్టులు చేసినట్లు ఇండియన్‌ ‌కౌన్సిల్‌ ‌ఫర్‌ ‌మెడికల్‌ ‌రీసెర్చ్ ఐసీఎంఆర్‌ ‌తెలిపింది. ఇప్పటి వరకు 29.33 కోట్ల పరీక్షలు చేసినట్లు చెప్పింది. ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా కొరోనా కేసుల్లో అమెరికా తర్వాత భారత్‌లోనే రెండు కోట్ల కేసులు నమోదయ్యాయి. ఇదిలావుంటే ప్రాణాంతక కొరోనా సెకెండ్‌ ‌వేవ్‌ను అదుపు చేసేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ‌విధించాలని ఆల్‌ ఇం‌డియా ట్రేడర్స్ ‌కాన్ఫెడరేషన్‌ (‌సీఏఐటీ) కోరింది. తమ ఆన్‌లైన్‌ ‌సర్వేలో పాల్గొన్న 67 శాతం మంది కొరోనా చైన్‌ను అడ్డుకునేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు అనుకూలంగా స్పందించినట్టు తెలిపింది. తక్షణమే దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీఎస్‌ ‌భరటియా, సెక్రటరీ జనరల్‌ ‌ప్రవీన్‌ ‌ఖండేల్వాల్‌ ‌కోరారు.

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ‌సాధ్యం కాని పక్షంలో కేవిడ్‌ ‌కేసులు గణనీయంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో పూర్తి లాక్‌డౌన్‌కు తాము సిఫారసు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ‌ప్రకటిస్తే గత ఏడాది తరహాలోనే నిత్యావసరాల సరఫరా, లభ్యత సక్రమంగా జరిగేలా తాము చూస్తామని సీఏఐటీ భరోసా ఇచ్చింది.’వాణిజ్య వర్గాలే కాదు, ప్రజలు కూడా దేశవ్యాప్తంగా పెరుగుతున్న కొరోనా కేసుల భయంలో చిక్కు కున్నారు. వైద్య వ్యవస్థ కుప్పకూలింది.

సమస్య తీవ్రతను పరిగణనలోకి తీసుకుని సీఏఐటీ ఆన్‌లైన్‌ ‌సర్వే జరిపింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ‌విధించాలని, ఢిల్లీలో కోవిడ్‌ ఆపరేషన్ల పర్యవేక్షణకు ఒక కేంద్ర మంత్రిని నోడల్‌ ఆఫీసర్‌గా నియమించాలని మెజారిటీ వ్యక్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు’ అని సీఏఐటీ తెలిపింది. తమ సర్వేలో దేశవ్యాప్తంగా 9,117 ట్రేడర్లు పాల్గొన్నారని, 78.2 శాతం ఇండియాలో కోవిడ్‌ ‌పరిస్థితి అదుపుతప్పిందని అభిప్రాయపడగా, 67 శాతం మంది పాన్‌-ఇం‌డియా (దేశవ్యాప్త) లాక్‌డౌన్‌కు సూచించారని పేర్కొంది.

Leave a Reply