ఖాట్మండు, జనవరి 16 : ఆధివారం పశ్చిమ నేపాల్‌లోని పోఖారాలో 72 మందిని తీసుకెళ్తున్న విమానం కూలిపోయింది. కూలిపోయిన ప్రదేశంలో శిథిలాల నుండి మృతదేహా లను వెలికితీసేం దుకు రెస్క్యూ టీమ్‌లు నిరంతరం పనిచేస్తున్నాయి. కాగా కుప్పకూలిన ఏటీ ఎయిర్‌లైన్స్ విమానంలోని రెండు బ్లాక్‌బాక్స్‌లను కనుగొన్నట్లు ఖాట్మండు విమానాశ్రయ అధికారులు తెలిపారు.
అయితే ఇంకా నలుగురు వ్యక్తుల జాడ తెలియరాలేదు. ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్ – కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ మరియు ఫ్లైట్ డేటా రికార్డర్ కనుగొనబడిందని, దాన్ని ఇప్పటికే సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ నేపాల్‌కు అప్పగించినట్లు ఏటి ఎయిర్‌లైన్స్ ప్రతినిధి తెలిపారు.