Take a fresh look at your lifestyle.

టీ.వీ.సదువుల సిత్రాలు!..

“పిలగాండ్లు లేని బళ్ళల్ల పంతుళ్ళ తిప్పలు ఇప్పుడే గిట్లుంటే రేపోమాపో టీ.వీ.పాటాలు మొదలైతె పాటాలు జూషినోళ్ళెంతమంది!? జూడనోళ్ళెంతమంది!? జూత్తె యేం నేర్సుకున్నరో రిపోటు,లేకుంటె యెందుకు జూడలేదో రిపోటు! రాయిమంటరు. పోన్ల టి శాట్‌ ‌వున్నోళ్ళెందరు!? వాళ్ళు పాటాలు జూసుకుంట పోట్వోలు దిగి పంపియ్యాలె!  గీ తిప్పలు పంతుళ్ళకు సుక్కలు జూపుడే ! ఏ.సి. లకింద గూసుండి కొనూన్లం జేషేటి పెద్దాపీసర్లకు గీడ యేం జరుగవట్టిందో తెల్వాలంటే గాళ్ళను సుత బస్తీలల్ల తిప్పాలె! కరోనా బీమారికన్న బుగులెంత పానం దీత్తదో సమజయితది. డిజిటల్‌ ‌సదువులు పంతుళ్ళ గండానికచ్చినట్టే కొడ్తాంది.”

Vikramarkuduఅలో!..అలో!..ఇనబడ్తాందా! అలో!..గంధం కొమురెల్లెనా!..
ఆ..ఆ.. ఎవలుల్లా! పొద్దటిసంది పతేకం పోన్‌ ‌జేయబడితిరి, ఎవలు!?
కొమురెల్లీ! నేను పెద్దబడి సారును!
మీ పిలగాని క్లాస్‌ ‌సారును!ఓ!సారూ! మీరా!నమస్తే! జెప్పుండ్రి!జెప్పుండ్రి! ఏమో ఫోన్‌ ‌జేయబడ్తిరి!బళ్ళుషాలైనయా సారూ!
కాలే!కాలే! పంతుళ్ళమే వత్తానం. పిలగాండ్లకు ఇప్పుడే బడిలేదు.టి.వీ లల్ల పాటాలైతయి! సరెగని,మీ ఇంట్ల టి.వీ కి ఏం కనెక్షన్‌ ‌వున్నది!
ఏమో సారూ!ఓ వైరైతె టి.వీ.డబ్బాకు ఎన్కమొగానున్నది. అట్ల గాదు, కొమురెల్లీ సన్‌ ‌టి.వీ. ఏర్‌ ‌టెల్‌ ‌గిసొంటియి!  ఏమో సారూ… గవన్నీ నాకేం దెల్సు,సరె గని! రోజు బడికత్తనే పోరల్లకు సదువులత్త లేవు,టి.వీ.ల జూషి నేర్సుకుంటరా! మీరడుగుడు సరె!మేం జెప్పుడు సరె గని! ఏం సదువులో!యేందో! పని కాడున్న!సాయంత్రం గోలిగె పోన్‌  ‌జేయుండ్రి. గిసొంటి పోన్‌ ‌ముచ్చట్లు బెట్టుడే బడి పంతుళ్ళ నౌకరైంది.పిలగాండ్లకు ఏదో తీర్గ ఓ టీ.వీ. వుండాలె! దానికి ఏదో ఒక కనెక్షన్‌ ‌వుండాలె! వూర్లెల్ల పాత కాలం డబ్బా టి.వీ.లున్నోళ్ళే మా గొప్ప! పిలగాండ్లు లేకుంట పంతుళ్ళు బడికచ్చి ఏం మావుల జేత్తరని వూరోళ్ళు అడుగబట్టిరి.

ఇంకో వూల్లె పెద్ద బడి పంతుళ్ళంత పంచాయితీ ఆపీస్‌ ‌కాడికచ్చి షిన్నపాటి  మైకుల ఏమో జెప్పబడితిరి.’’ఊర్లె అందరినుండ్లి! ఒకటో తారీకు సంది టీ.వీ.లల్ల బడి పాటాలు జెపుతరు. ఇంట్ల టీ.వీ.ల దూరదర్శన్‌ ‌యాద్గిరి శానెల్ల పాటాలు జూడుమని మీ పిలగాండ్లకు జెప్పుండ్రి. పిలగాండ్లకు పెద్దపోన్లుంటె పలానాపలానా ఆప్‌ ‌లేషి పాటాలు జూషేటట్టు మీరు సుత ఎంబడుండండి’’ అని వూర్లె పద్దిక్కులతిరిగి జెప్పబట్టిండ్లు.గిట్ల పంతుళ్ళు జెప్పేటితీరు జూషి అందరు మాస్క్ ‌సాటున నవ్వుకోబట్టిండ్లు. బడి పిలగాండ్లకు పోన్లు ఇత్తె షెడిపోతరు!దిక్కుమెల్ల బొమ్మలు జూత్తరు. సిన్మాలు జూత్తరని మీరే అనేది కాదా సారూ! ఇప్పుడు పోన్లియ్య మంటాండ్లు!అప్పుడేమో షెడిపోయేటోళ్ళు, ఇప్పుడేం గాదాను!,పోన్లియ్యమని మీరే గిప్పుడు  జెప్పబట్టిండ్లు.మీరేంజెప్తె గదే కానూనా!యేంది!? అని కొందరు పంతుళ్ళ మీదికి లొల్లికి దిగబట్టిరి. పక్కూర్లె బడిల మొదటి దినమె ఓ పంతులమ్మకు బడికచ్చినంక మొస్సాడుతలేదని ఆగమాగమైతాంటె ఆరోగ్య కేంద్రంల పరీచ్చలు జేయించిండ్లు.తీర జూత్తె ఆ పంతులమ్మకు కరోనా బీమారి సోకింది పాజిటివని ఎరుకాయె! వామ్మో! ఎంబడి పని జేషే నల్గురు పంతులమ్మలకు బుగులు జొచ్చింది.వాళ్ళకు  సుత కరోనా అచ్చిందనుకున్నరు,ఇంటికి పోయి ఇంట్లున్నోళ్ళకు కరోనా తగిలిచ్చుడెందుకనిబళ్ళెనే కారెంటైన్ల వుందామనుకున్నరు.పాత సాపలడుక్కోని వూరోళ్ళు బెట్టిందింత తిని బళ్ళనే వుండబట్టిండ్లు.గీ ముచ్చట నలుగురింటికి మతలబ్‌ ‌జేషి గిట్ల సంగతని జెప్పెటాలకు వాళ్ళిండ్లల్ల అందరు ఏడుపులందుకునె! గీ రొండు మూడు దినాలు ఆ పంతులమ్మతోని బస్సెక్కి బళ్ళకు బోయచ్చిన సుట్టుపక్కల బళ్ళ పంతుళ్ళు,పంతులమ్మలందరు బుగులు తోని కరోనా పరీచ్చల కోసం వుర్కబట్టిండ్లు. వాళ్ళ ఇండ్లల్ల కరోనా బీమారి కన్నా బుగులే పానం మీదికి అచ్చే కత కానత్తాంది.

బళ్ళెపంతుళ్ళు పానం బిగవట్టుకోని బుగులు వడ్తాంటె పెద్దాపీసులనుంచి జోరుగ పనులు జెప్పబట్టిండ్లు. పంతుళ్ళందరు వాళ్ళ వాళ్ళ తరగతి పిలగాండ్ల ఇండ్లకు వోయి ఆన్‌ ‌లైన్‌ ‌పాటాలు ఎట్లినాల్నో జెప్పి,ఇవరాలు రాసుకరమ్మనె!బస్తీలల్లకు బోతె ‘‘కరోనా బుగులు బోయెదాంక సదువులు లేదు,గిదువులు లేదు! టీ.వీ.లంటరు,డిష్‌ ‌కనెచ్చన్లంటరు. పెద్ద పోన్లంటరు,అండ్ల డాటా సిమ్ములంటరు. గీ తాకట్ల సదువులు యేనాడన్న ఎరికేనా! కరోనా రాకుంట పైలంగ బళ్ళెప్పుడుంటె గప్పుడే సదువులు !పొండి సారూ!మా బస్తీల కరోనా అచ్చినోళ్ళున్నరు. పోండి!పోండి!’’అని జనం ఎనుకకు మర్లమనబట్టె! పిలగాండ్లను కల్షేందుకు బస్తీల తిర్గకుంటె పెద్ద సార్లతోని తిప్పలాయె!తిర్గుతె కరోనా బుగులాయె!   మంగలారం కేలి అచ్చేటి పాటాలు పిలగాండ్లు యెట్ల  జేషి టీ.వీ లల్ల జూషే తీర్గ జేయాలె! పుసుక్కున ఏ పిలగాని కన్న టీ.వీ,పోన్‌ ‌గిట్ల లేకుంటె సార్లదే బాద్దెత అని సర్కారే కుల్లంకుల్ల జెప్పబట్టె!టీ.వీ. లు సుత లేనిండ్లు సగం కన్న యెక్కువనే లెక్కదేలుతానయి.అసొంటి  పిలగాండ్ల బాద్ధెత తీస్కునుడంటె ఇండ్లకు తీస్కవోయి సూపాల్నా! టీ.వీ.లు లేనోళ్ళు  పక్కింటిసోపతి గాండ్ల తానకు వోయి జూషి సదువుకోవాలంటే కరోనాకాలంల వేరోళ్ళను ఇంట్లరానిచ్చేటట్టున్నదా!     తిప్పలు బడి యెట్నోగట్ల బడి అయినంక ఇంటి మొకాన బోతే ఇంటామె తోని తిప్పలాయె! వొంటి మీది బట్టలు గల్మ కాడిడిషి బాయి కాడి తానం అయితెనే ఇంట్లకు రానియ్యబట్టె! సుట్టుపక్కలోళ్ళు ఇచ్ఛంత్రంగ బాయికాడి తానాలు ఎటమటంగ జూషి అనుమానబడబట్టె! దూరందూర వుండుకుంట, మీదిమీది పల్కరిచ్చుడు తోని ఇజ్జత్‌ ‌దీయబట్టె! నిజంగనే కరోనా బీమారచ్చినంత నూమాషి గావట్టె!  మావూర్లె గుడిబళ్ళె ఓ పంతులు బళ్ళె పెయితిప్పి గెక్కున కక్కుకున్నడట! ఒరిత్త! యేమున్నది వున్న పంతుళ్ళంత దునికి దూరమురుకుడు బెట్టిండ్లు. ఆ పంతులుకు కరోనచ్చిందని పుకార్‌ ‌లేపిండ్లు. తీర జూత్తె ఆ పంతులు పొద్దటిగట్ల ఇంట్ల పప్పుశారు మస్తున్నదని ఓ బుక్క జరెక్కువ తిన్నడట! బళ్ళె గప్పుడే కరోనా పిచికారు గొట్టి పోయిండ్లట!ఆ వాసన బడక గెక్కువన్నడు.ఇగజూడు బడంత ఓ దిక్కయితె పంతులో దిక్కయిండు. ఆ పంతులు ఇజ్జత్‌ ‌దీషిండ్లనుకోరాదుండ్లి.
పిలగాండ్లు లేని బళ్ళల్ల పంతుళ్ళ తిప్పలు ఇప్పుడే గిట్లుంటే రేపోమాపో టీ.వీ.పాటాలు మొదలైతె పాటాలు జూషినోళ్ళెంతమంది!? జూడనోళ్ళెంతమంది!? జూత్తె యేం నేర్సుకున్నరో రిపోటు,లేకుంటె యెందుకు జూడలేదో రిపోటు! రాయిమంటరు. పోన్ల టి శాట్‌ ‌వున్నోళ్ళెందరు!? వాళ్ళు పాటాలు జూసుకుంట పోట్వోలు దిగి పంపియ్యాలె!  గీ తిప్పలు పంతుళ్ళకు సుక్కలు జూపుడే !

ఏ.సి. లకింద గూసుండి కానూన్లు జేషేటి పెద్దాపీసర్లకు గీడ యేం జరుగవట్టిందో తెల్వాలంటే గాళ్ళను సుత బస్తీలల్ల తిప్పాలె! కరోనా బీమారికన్న బుగులెంత పానం దీత్తదో సమజ యితది. డిజిటల్‌ ‌సదువులు పంతుళ్ళ గండాని కచ్చినట్టే కొడ్తాంది.  ‘‘సూడ్రా బయ్‌! ‘‘ఇ‌క్రమార్క్’’!
‘‘ఇప్పటిదాంక ఇంటివి కదా! టీ.వీ.లల్ల డిజిటల్‌ ‌పాటాలు జెప్పుడైతె సదువులు ముం దుకు సాగుతయా! సదువుల యేమన్న సక్కదన ముం టదా!?  గీ ప్రశ్నకు జవాబు జెప్పాలె! లేకుంటె మళ్ళా షెట్టెక్కి,నీకు సుత డిజిటల్‌ ‌టీ.వీ.ల్నే కానత్త! యేవ నుకున్నవో! నని బెదిరి చ్చేటి భేతాళుని ఎప్పటి తీర్గనే భుజం మీదేసుకొని ‘‘విను! భేతాళ్‌! ‌సర్కార్‌ ‌సదువులను ప్రయివేటోళ్ళకు ఇయ్యాలె! అందుకే సర్కార్‌ ‌సదువుల కాడెత్తేషే కతలు వడుతాంది. ఎదురుంగ సారుండి షెప్పేదే పాటం, అనుమానవత్తె ఎవల్ని అడుగాలె! అని నిన్న కోర్టే సవాలు జేషె!? జవాబేది!? ఇసొంటి చింత మడకకతలు వడి వున్నయన్ని నాశినం పదారువాళ్ళం జేషిన పోశెట్టి సదువంల నర్సుకునుడంటె గిదే మరి!. పంతుళ్ళను ఆగం బట్టిచ్చుడు తప్ప ఇంకోటి గాదు!. అని జెప్పుకుంట నడ్వబట్టిండు.. నడ్వ బట్టిండు…

– ఎలమంద.తెలంగాణ.

Leave a Reply