Take a fresh look at your lifestyle.

నిస్వార్ద సేవకుడు టివి చౌదరి

ఖమ్మం సిటి, జూన్‌ 3 (‌ప్రజాతంత్ర విలేకరి) : కమ్యూనిస్టు నేత, నిస్వార్ద ప్రజాసేవకుడు రైతు సంఘం నాయకులు టివి చౌదరి అని రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన కమ్యూనిస్టు నేతలు, రాజకీయ, వ్యాపార,ఉద్యోగ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. గత రాత్రి ఖమ్మంలో మరణించిన సిపిఐ సీనియర్‌ ‌నాయకులు టివి చౌదరి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్దం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఉంచారు. ఈ సందర్బంగా నిర్వహించిన సంతాపసభలో పలువురు హాజరై నివాళులర్పించారు. తొలుత సిపిఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర సహాయకార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సబ్యులు భాగం హేమంతరావు, ఉభయ జిల్లాల కార్యదర్శులు పోటు ప్రసాద్‌,‌సాబీర్‌పాషాలు మాట్లాడుతూ నిత్యం ప్రజల సమస్యలపై పోరాటం చేసి వ్యక్తి అని కొనియాడారు. పార్టీకి, పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను ఎనలేనివని పేర్కోన్నారు.ఆయన మరణం పార్టీకి, బడుగు బలహీనవర్గాల వారికి, ముఖ్యంగా రైతాంగానికి తీరని లోటు అన్నారు. చౌదరి భౌతికకాయానికి నివాళులర్పించిన వారిలో ఎంపి నామా, జెడ్పీ మాజీ చైర్మన్‌ ‌కాశయ్య, సిపిఎం నేత పోతినేని, ఎన్‌డి నేత రంగారావు, నల్లమల వెంకటేశ్వర్లు, ఎంఎల్‌సి బాలసాని, డిసిసిబి చైర్మన్‌ ‌కూరాకుల ఉన్నారు.మంత్రి పువ్వాడ అజయ్‌ ‌నివాళి ఖమ్మం జిల్లాకు చెందిన సిపిఐ సీనియర్‌ ‌రాష్ట్ర నాయకులు టివి చౌదరి గత రాత్రి ఖమ్మంలో తుదిశ్వాస విడిచారు.

మమత ఆసుపత్రిలో ఉంచిన ఆయన భౌతికకాయాన్ని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ‌బుధవారం ఉదయం సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. చౌదరి ఆకస్మిక మృతి పట్ల మంత్రి అజయ్‌ ‌సంతాపాన్ని వ్యక్తం చేసారు. ఆయన ఆత్మకు శాంతి క)గాలని కోరుతూ ఘనం గా నివాళులర్పించారు. చౌదరి కుటుంబానికి తన ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేసారు.యువ తెలంగాణ సంతాపం సిపిఐ సీనియర్‌ ‌నాయకులు టివి చౌదరి మృతికి యువ తెలంగాణపార్టీ ఖమ్మం జిల్లా కమిటి తీవ్ర సంతాపం తెలిపింది. ఈ మేరకు సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆయన పార్దివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆ పార్టీ నాయకులు జక్కుల వెంకటరమణ, యువజన విభాగం జిల్లా అద్యక్షులు షేక్‌ ‌పాషా, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు నల్లమోతు శ్రీనివాసరావులు మాట్లాడుతూ టివి చౌదరి నిజాయితీ, నిస్వార్దంగల కమ్యూనిస్టు యోధుడని కొనియాడారు. ఆయన జిల్లా రైతాంగానికి సురపరిచితుడన్నారు. కమ్యూనిస్టు పార్టీ నిర్మించిన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించి బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. ఆయన మృతి రైతాంగానికి తీరని లోటు అన్నారు. జిల్లాలో మంచి పేరు అప్పటి తరం నాయకుడని చెప్పారు. ఈ సందర్బంగా చౌదరి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!