Take a fresh look at your lifestyle.

జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించడం అన్యాయం.. TUWJ-IJU దీక్షలో పలువురు ఆందోళన

కొరోనా మహమ్మారిని నివారించడానికి ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించడం అన్యాయమని, జర్నలిస్టులను అదుకునేంతవరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు మనోజ్ కుటుంబానికి రూ.50లక్షల పరిహారం చెల్లించాలని, ప్రతి జర్నలిస్టుకు రూ.50లక్షల బీమా వర్తింప జేయాలని, మీడియా సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో శనివారం నాడు టీయూడబ్ల్యుజె-ఐజేయూ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిర్వహించిన ఉపవాస దీక్ష విజయవంతంగా జరిగింది. వందలాది జర్నలిస్టులు ఈ దీక్షలో పలుపంచుకోగా, ఆయా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సీనియర్ పాత్రికేయులు సంఘీభావం ప్రకటించాయి.

యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ దీక్షా కార్యక్రమంలో ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, జకీర్, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఎం.ఏ.మాజిద్, మాజీ సభ్యులు అమర్ నాథ్, యూనియన్ నాయకులు విష్ణుదాస్ శ్రీకాంత్, రాజేష్, రియాజ్, స్వామి, హాబీబ్ జిలానీ, శంకర్ గౌడ్, రాములు, యాదగిరి, శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బలరాజ్, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొండేటి సురేష్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, వెటరన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ నాయకులు లక్ష్మణ్ రావు, టి.జర్నలిస్ట్స్ ఫోరమ్ వ్యవస్థాపకులు పల్లె రవి, టీపీసీసీ మీడియా ఇంచార్జ్ మల్లు రవి, తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరి ,టీటీడీపీ మహిళ విభాగం అధ్యక్షురాలు ప్రొఫెసర్ జోత్స్నా , ఉస్మానియా యూనివర్సిటీ జాక్ నాయకులు దరువు అంజన్న తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!