Take a fresh look at your lifestyle.

కుమ్మరి సారేను తిప్పి… కుండను తయారు చేసి…

బక్రిచెప్యాలలో మట్టి కుండను తయారు చేసిన మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట పర్యటనలో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట అర్భన్‌ ‌మండలంలోని బక్రిచెప్యాల, నాంచారుపల్లిలో శుక్రవారం వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. బక్రిచెప్యాలలో శాలివాహన (కుమ్మరి) సంఘం భవనం ప్రారంభించిన హరీష్‌రావు…పక్కనే ఉన్న సారే(చక్రం)ను చూశారు. మట్టి కుండలను తయారు చేస్తున్న విధానాన్ని పరిశీలించి…తాను కూడా ఒక్క మట్టికుండను చేస్తానని చెప్పి కుమ్మరి సారేను తిప్పి ఒక మట్టి కుండను తయారు చేశారు. శాలివాహన సంఘం భవనం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి హరీష్‌రావు కుమ్మరి చక్రంను తిప్పి కుండను తయారు చేసి సందడి చేశారు. నాంచారుపల్లిలో జరిగిన పలు కార్యక్రమాల్లోనూ మంత్రి పాల్గొన్నారు. నాంచారుపల్లి స్టేజీ వద్ద రాజీవ్‌ ‌రహదారి నుంచి నాంచారుపల్లి, బక్రిచెప్యాల, వెల్కటూరు, కోనాయిపల్లి, నర్మెట్ట, నంగునూరు, ఘణపూర్‌, ‌కొండంరాజ్‌పల్లి మీదుగా తోర్నాల వరకూ దాదాపు 31కిలో మీటర్ల మేర రూ.23 కోట్ల 34 లక్షల వ్యయంతో నిర్మించనున్న బిటి డబుల్‌ ‌రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పంచాయతీ రాజ్‌ ‌శాఖ ప్రగతిలో రాష్ట్రంలోనే అతిపెద్ద సౌకర్యవంతమైన రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు హరీష్‌రావు వెల్లడించారు. డబుల్‌ ‌బిటి రోడ్డు నిర్మాణంతో రాజీవ్‌ ‌రహదారికి అనుకుని ఉన్న నాంచారుపల్లి గ్రామ దశదిశ మారనున్నదని మంత్రి చెప్పారు. 23 కోట్ల 34 లక్షల రూపాయలతో తొమ్మిది గ్రామాలను కలుపుకుని 3 మండలాల పరిధిలో 32 కిలో మీటర్ల మేర బిటి డబుల్‌ ‌రోడ్డుతో చుట్టుపక్కల మండలాలైన సిద్ధిపేట అర్బన్‌, ‌చిన్నకోడూర్‌, ‌నంగునూరు మండలాలతో పాటు దాదాపు 25 గ్రామాల ప్రజల సౌకర్యార్థం ప్రయోజన కరంగా ఈ బిటి డబుల్‌ ‌రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం చేసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావుకు రాఖీ-రక్షా బంధన్‌ ‌పండుగను పురస్కరించుకుని బక్రి చెప్యాల గ్రామ మహిళా సంఘ ప్రతినిధి మంత్రికి రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సిద్ధిపేటలో ఆర్‌బిఅండ్‌బి నూతన భవనం ప్రారంభం..
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట బ్యాంకు కాలనీలో జిల్లా ఆర్‌అం‌డ్‌బి భవన కార్యాలయాన్ని శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈ మేరకు కార్యాలయంలో గదులన్నీ కలియ తిరిగి జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రధాన రహదారుల నిర్మాణాల అంశంపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం జరపాలని ఎస్‌ఈకి మంత్రి సూచించారు. అంతకు ముందు కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ ‌వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌రాజనర్సు, సుడా చైర్మన్‌ ‌రవీందర్‌ ‌రెడ్డి, ఆర్‌అం‌డ్‌బి ఈఈ సుదర్శన్‌, ఆర్‌అం‌డ్‌బి అధికారిక యంత్రాంగం, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సిద్ధిపేటలో.. రాష్ట్రంలోనే తొలి క్రైస్తవ భవనం ప్రారంభం…
ప్రభుత్వ స్థలం ఇచ్చి ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలోనే తొలి క్రైస్తవ భవనం సిద్ధిపేటలో నిర్మించుకుని ప్రారంభం చేసుకున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు చెప్పారు. సిద్ధిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు కేసీఆర్‌ ‌నగర్‌ ‌లో రూ.48 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన క్రిస్టియన్‌ అం‌డ్‌ ‌పాస్టర్స్- ‌క్రిస్టియన్‌ ‌కమ్యూనిటీ భవనాన్ని, రూ.45 లక్షల వ్యయంతో నిర్మించిన గంగిరెద్దుల కమ్యూనిటీ భవనాన్ని మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా క్రైస్తవులకు కమ్యూనిటీ భవనాలు జిల్లాలోని గజ్వేల్‌, ‌సిద్ధిపేటలో నిర్మించుకుని వినియోగించుకుంటున్నట్లు మంత్రి వివరించారు. పండుగ ఏదైనా ప్రభుత్వం అన్నీ మతాల వారిని కూడా సముచితంగా చూస్తూ.. క్రిస్మస్‌ ‌పండుగకు కానుకగా దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు, అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు భవన నిర్మాణం పూర్తి చేసుకున్నట్లు, పట్టణంలో పరలోక యాత్ర వాహనం కూడా ఏర్పాటు చేసుకున్నామని మంత్రి వివరించారు. ఇంకా ఏ సమస్యలు ఉన్నా దశల వారీగా పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ‌ఛైర్మన్‌ ‌కడవేర్గు రాజనర్సు, ఏఎంసి ఛైర్మన్‌ ‌పాల సాయిరాం, వార్డు కౌన్సిలర్‌, ‌సిఎస్‌ఐ ‌చర్చి ఫాస్టర్‌ అశోక్‌, ‌క్రిస్టియన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సత్యానందం, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply