Take a fresh look at your lifestyle.

2 లక్షల విరాళం అందజేసిన తుమ్మల పాండురంగారెడ్డి

అయోధ్య శ్రీ రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణానికి నిధి సేకరణలో భాగంగా అమీన్‌ ‌పూర్‌ ‌మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌తుమ్మల పాండురంగారెడ్డి తన వంతుగా 2 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ చెక్కును ట్రస్ట్ ‌సభ్యులకు ఇచ్చారు. ఆయనతో కౌన్సిలర్లు కల్పన ఉపేందర్‌ ‌రెడ్డి రూ. 51వేలు, సత్యనారాయణ రెడ్డి రూ.10,116 అందజేశారు.

ఈ సందర్భంగా తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో వందల సంవత్సరాల తర్వాత రామ జన్మభూమిలో మందిర నిర్మాణానికి దేశ ప్రజలందరూ తమ వంతు భాగస్వామ్యంగా నిధుల ఇవ్వాలని కోరారు. పార్టీలకు అతీతంగా రామమందిరం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నగదును ఇవ్వాలని సూచించారు.

Leave a Reply