Take a fresh look at your lifestyle.

మళ్లీ భక్తులకు శ్రీవారి లడ్డూ ప్రసాదాలు అమ్మకాలు ప్రారంభించిన టిటిడి

శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్‌తో ఆలయంమూసేసిన తరవాత ఇప్పుడు మళ్లీ ప్రసాద అమ్మకాలు మొదలు పెట్టారు. టీటీడీ ప్రధాన పరిపాలన భవనం వద్ద దాదాపు 55 రోజుల తర్వాత శ్రీవారి లడ్డూలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో శ్రీవారి లడ్డూ కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. కరోనా వ్యాప్తి కారణంగా భక్తులకు గత 55 రోజులుగా తిరుమల శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. దర్శనాన్ని నిలిపివేసినప్పటికీ ఆలయంలో స్వామి వారి నిత్య కైంకర్యాలను అర్చకులు నిర్వహిస్తూనే ఉన్నారు. మరికొద్ది రోజుల్లో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ ‌కారణంగా నిలిచిపోయిన తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఉదయం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. తిరుపతిలోని ప్రధాన పరిపాలన భవనం వద్ద వీటిని అమ్ముతున్నారు. లాక్‌డౌన్‌ ‌వల్ల నిలిచిపోయిన శ్రీవారి లడ్డూలను మళ్లీ భక్తులు పొందే అవకాశం లభించింది. లడ్డూ విక్రయాలు ప్రారంభమయ్యాయని తెలుసుకున్న భక్తులు వాటి కోసం భారీగా తరలిరావడం గమనార్హం. కరోనా విజృంభణతో శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. స్వామి వారి నిత్య కైంకర్యాలను మాత్రం అర్చకులు నిర్వహిస్తున్నారు. సామాజిక దూరం నిబంధనలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో త్వరలో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply