Take a fresh look at your lifestyle.

తి తి దే నిధులు కాపాడిన చైర్మన్ వై వి సుబ్బా రెడ్డి ముందు చూపు..!

ఆర్థిక సంక్షోభం, క్రమశిక్షణ లేమి…తో కుదేలయిన ఎస్ బ్యాంక్ కార్యకలాపాలపై భారతీయ రిజర్వ్ బ్యాంకు గురువారం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే…బోర్డ్ ను కూడా రద్దు చేసి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి పర్యవేక్షణ కోసం ఇద్దరు అధికారులను కూడా నియమించింది.ఖాతాదారులు రు.50 వేల కు మించి డబ్బును విత్ డ్రా చేయలేరని నిబంధన విధించింది.ఖాతాదారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

కానీ..తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బా రెడ్డి ముందు చూపు వల్ల ఎస్ బ్యాంకు లో జమ చేయబడ్డ తి తి దే 1300 కోట్లు కొన్ని నెలల క్రితమే ఉప సంహరించుకుంది.చంద్ర బాబు హయాంలో కొన్ని ప్రైవేట్ బ్యాంకు లలో తి తి దే నిధులు, ప్రభుత్వ నిధులు జమ చేయడం వివాదం కు దారి తీసింది.చైర్మన్ వై వి సుబ్బా రెడ్డి ఈ విషయం ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టి కి తెచ్చి..తి తి దే నిధులు కాపాడడం గమనార్హం.

Tags: S Bank with financial crisis, lack of discipline, Reserve Bank of India

Leave a Reply