Take a fresh look at your lifestyle.

కొరోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు టిటిడి విస్తృత ఏర్పాట్లు

తిరుమ‌ల‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ ఆదేశాల మేర‌కు అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి పర్యవేక్షణలో టిటిడిలోని అన్ని విభాగాలు ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టింది.

ఇందులో భాగంగా టైంస్లాట్ టోకెన్లు ద్వారా శ్రీ‌వారి ద‌ర్శ‌నం –

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 12.00 గంట‌ల నుండి టైంస్లాట్ టోకెన్లు జారీ చేసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్- 1 మ‌రియు 2ల‌లో  వేచి ఉండ‌కుండా నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతించారు.

అన్న‌ప్ర‌సాదం  – 

తిరుమ‌ల‌లోని త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో ఒక్కొక్క హాలులో 1000 మంది భోజ‌నం చేసే అవ‌కాశం ఉన్న‌, 500 మందికి మాత్ర‌మే భోజ‌నం అందిస్తున్నారు. ఇందులో ఒక టేబుల్‌కు న‌లుగురు కుర్చోవ‌ల‌సి ఉండ‌గా ఇద్ద‌రికి మాత్ర‌మే భోజ‌నం ఏర్పాటు చేశారు. ఉద్యోగులు అంద‌రు మాస్కులు ధ‌రించి, శానిటైజ‌ర్ల‌తో చేతుల‌ను ఏప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేసుకుంటున్నారు. అదేవిధంగా తిరుమ‌ల‌లోని వివిద ఫుడ్ కౌంట‌ర్ల‌ల‌లోను మాస్కులు ధ‌రించి అన్న‌ప్ర‌సాదాలు పంపీణి చేస్తున్నారు.

క‌ల్యాణ క‌ట్ట –  

తిరుమ‌ల‌లోని ప్ర‌ధాన క‌ల్యాణ‌క‌ట్ట‌తో పాటు వివిద ప్రాంతాల‌లోని 9 మినీ క‌ల్యాణ‌ క‌ట్ట‌ల‌లో భ‌క్తులు వేచి ఉండ‌కుండా స‌త్వ‌రం త‌ల‌నీలాలు స‌మ‌ర్పించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. క‌ల్యాణ క‌ట్ట‌ల‌లోని క్షుర‌కులకు మాస్కులు, డెటాల్‌, సొల్యూష‌న్‌ అందించారు. ప్ర‌తి 2 గంట‌ల‌కోసారి ప‌రిశుభ్ర‌త(శానిటైజ్‌) చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప్ర‌ధాన క‌ల్యాణ క‌ట్ట‌లో ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

వ‌స‌తి విభాగం – 

తిరుమ‌ల‌లోని వ‌స‌తి గృహ‌లు, అతిథి భ‌వ‌నాలు, వ‌స‌తి స‌మూదాయాల‌లో (పిఏసిలు) అద‌న‌పు సిబ్బందిని ఏర్పాటు చేసి శుభ్రం చేస్తున్నారు. వ‌స‌తి గ‌దులను భ‌క్తులు ఖాళీ చేసిన త‌రువాత ఒక గంట పాటు స‌రైన విధంగా శుభ్రం చేసిన త‌రువాత మ‌రొక‌రికి కేటాయిస్తున్నారు.

ఆరోగ్య విభాగం –
టిటిడి ఆరోగ్య విభాగాధికారి డా.ఆర్‌.ఆర్‌.రెడ్డి ఆధ్వ‌ర్యంలో తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్ధీ అధికంగా ఉన్న ప్రాంతాల‌లో శానిటైజర్లు, ప్ర‌తి రెండు గంట‌ల‌కు ఒక‌సారి అంటు రోగ నివార‌ణ మందుల‌తో ప‌రిస‌రాల‌ను శుభ్రం చేస్తున్నారు. అద‌న‌పు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని పారిశుద్ధ్య సామ‌గ్రిని ఎప్ప‌టిక‌ప్పుడు అందిస్తున్నారు.  టిటిడిలోని అన్ని విభాగాల అధికారులకు, సిబ్బందికి అవగాహన కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. తిరుమ‌ల‌లో విధులు నిర్వ‌హించే ఉద్యోగులంద‌రికి మాస్కులు, శానిటైజర్లు అందించారు.

అలిపిరి చెక్‌పాయింట్ నుండి తిరుమ‌ల‌కు వ‌చ్చే వాహ‌నాల‌పై అంటు రోగ నివార‌ణ మందుల‌తో పిచికారీ చేస్తున్నారు. తిరుమల లోని ఆరోగ్య విభాగం కార్యాలయంలో ఏర్పాటు చేసిన‌ కంట్రోల్ రూం 24 గంటల పాటు పని చేస్తుంది. యాత్రికులు 0877 – 2263447  నంబరుకు ఫోన్ చేసి కరోనా వ్యాప్తి  నివారణ చర్యలను తెలుసునేలా చ‌ర్య‌లు చెప‌ట్టారు.

  వైద్య విభాగం –
అలిపిరి చెక్‌పాయింట్‌, అలిపిరి న‌డ‌క‌మార్గంలోని పాదాల మండ‌పం, శ్రీ‌వారి మెట్టు న‌డ‌క మార్గం వ‌ద్ద క‌రోనా వ్యాప్తి నివార‌ణ వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి భ‌క్తుల‌కు థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ ద్వారా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. తిరుమ‌ల‌లోని వివిద ప్రాంతాల‌లో ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు, డాక్ట‌ర్లు, పారామేడిక‌ల్ సిబ్బంది, మందులు, అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. ప్రాథ‌మికంగా వైర‌స్ ల‌క్ష‌ణాల‌ను గుర్తిస్తే తిరుమ‌ల‌కు అనుమ‌తించ‌కుండా రుయా ఆసుప‌త్రిలోని ఐసోలేష‌న్ వార్డుకు పంపుతున్నారు.

ద‌ర్శ‌న టికెట్ల తేదీల‌ను మార్చుకునే అవ‌కాశం –

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి మే నెల 31వ తేదీ వ‌ర‌కు ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో పొందిన భక్తులకు త‌మ ద‌ర్శ‌న తేదీలు మార్చుకునే వెసులుబాటును, ర‌ద్ధు చేసుకుంటే న‌గ‌దు రీఫండ్ పొందే సౌక‌ర్యాన్ని క‌ల్పించారు. అదేవిధంగా భ‌క్తులు వేచి ఉండే స‌మ‌యాన్ని త‌గ్గించేందుకు విశేష‌ పూజ, సహస్ర కలశాభిషేకం మరియు వసంతోత్సవం వంటి ఆర్జీత సేవ‌ల‌ను రద్దు చేశారు.

విస్తృతం ప్ర‌చారం – 
క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌కు భ‌క్తుల‌లో అవ‌గాహ‌ణ క‌ల్పించేందుకు శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్, రేడియో అండ్ బ్రాడ్ కాస్టింగ్ విభాగాల‌ ద్వారా తిరుమ‌ల‌లోని ముఖ్య కూడ‌ళ్ల‌లోనూ, ర‌ద్ధీ అధికంగా ఉండే ప్రాంతాల‌లో నిరంత‌రాయంగా ప్ర‌చారం చేస్తున్నారు.

Leave a Reply

error: Content is protected !!