Take a fresh look at your lifestyle.

కరొనా బారిన పడిన జర్నలిస్టుల కు మీడియా అకాడమీ చేయుత..!

  • తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
కరోనా బారిన పడిన జర్నలిస్టుల ను అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. కరొనా వైరస్ మీడియా కవరేజ్ లో కొంతమంది తెలంగాణ జర్నలిస్టులకు ఈ వైరస్ సోకిందనీ,ఈ వైరస్ బారిన పడిన జర్నలిస్ట్ కు మీడియా అకాడమీ తరఫున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. న్యూ ఢిల్లీ లో ముగ్గురు జర్నలిస్టుల కు‌,గద్వాల జిల్లా లోని ఒక జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఈ నలుగురికి ఇరవై వేల చొప్పున 80 వేల రూపాయలు ఆర్థిక సాయం అందిచినట్లు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిఐదు మంది జర్నలిస్టుల కుగద్వాల లోని  నలుగురు జర్నలిస్టులు మొత్తం 
తొమ్మిది మంది జర్నలిస్టులు హోం క్వారంటైన్ లో ఉన్నారని  వీరందరికీ పదివేల రూపాయల
చొప్పున  90 వేల రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు ఆయన తెలిపారు.ఈ మొత్తాన్ని వారి బాంక్ అకౌంట్ లలో జమ చేశామని తెలిపారు.
జర్నలిస్టులు సమాజహితం కోసం పనిచేయాలంటే ముందుగా ప్రాణాలతో ఉండాలన్నారు. ప్రాణం కన్నా విలువైంది ఏది లేదన్నారు.కరోనా వైరస్ విజృంభింస్తున్న నేపథ్యంలో జర్నలిస్టుల ఆరోగ్య పరమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలని కోరారు.
 జర్నలిస్టులు భౌతిక దూరం పాటించాలని,వీలైనన్ని సార్లు చేతుల ను శుభ్రపరుచుకోవాలని అన్నారు. శానిటైజర్లు ఉపయేగించాలని సూచించారు.మాస్కులను ప్రతి ఒక్కరూ ధరించాలని అన్నారు. సమాజం కన్నా ముందు మనపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఉన్నారని, ఈ విషయాన్ని జర్నలిస్టులు గమనించాలని ఆయన సూచించారు.

Leave a Reply