ఖమ్మం సిటి, మే 19 (ప్రజాతంత్ర విలేకరి): కరోనా నేపధ్యంలో లాక్డౌన్ను కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించి పటిష్టంగా అమలుచేయడంతో మార్చి 23నుండి అమలుచేసిన నిరవధిక బంద్ చేయడంతో ఆగిపోయిన ఆర్టీసి రథచక్రాలు 58 రోజుల అనంతరం తిరిగి మంగళవారం రోడ్డెక్కాయి, కరోనా లాక్డౌన్ నేపద్యంలో బస్సులు నడుస్తాయా లేదా నడిస్తే ఎపుడు నడుస్తాయోనన్న అనుమానాలకు రాష్ట్రప్రభుత్వం తెరదించటంతో మంగళవారం నుండి ఆర్టిసి బస్సులు రయ్యుమని దూసుకపోతున్నాయి.
లాక్డౌన్ నిబంధనలను అనుసరించి తొలిరోజు పరిమిత సంఖ్యలోనే బస్సులను నడిపినట్లు సమాచారం. రానున్న రోజుల్లో బస్సుసర్వీసుల సంఖ్య పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక దూరం పాటించాలని ఆర్టీసి ప్రయాణీకులకు విజ్ఞప్తి చేస్తోంది. మాస్క్లు ధరించకుండా ఉంటే ఊరుకునే వీలు లేదు.