Take a fresh look at your lifestyle.

38 మంది ఆక్సీజన్‌ అం‌దక చనిపోతే ప్రభుత్వానికి పట్టద ?

“ఇప్పటి వరకు ప్రభుత్వ దవాఖానాలలో 38 మంది కోవిడ్‌ ‌బాధితులు ఆక్సీజన్‌ అం‌దక మరణిస్తే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు .. ప్రభుత్వ దవాఖానాలలో ఆక్సీజన్‌ అం‌దించడానికి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకున్నారో తెలపాలి ..  పాజిటివ్‌ ‌కేసులు రోజురోజుకూ భారీ సంఖ్యలో పెరుగుతున్నప్పటికీ నివారణ, నియంత్రణ చర్యలు చేపట్టడంలో అధికారులు ఎందుకు విఫలమయ్యారు … మీడియాకు విడుదల చేస్తున్న కొరోనా బులెటిన్‌ ‌సైతం తప్పుల తడకగా ఉంది .. ఈ విషయంలో కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోలేదు…   – హైకోర్టు”

  • అధిక చార్జీలు వసూలు చేసిన ప్రైవేటు హాస్పిటల్స్‌పై చర్యలేవి
  • కొరోనా నియంత్రణ, చికిత్సలపై ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
  • డబ్ల్యుహెచ్‌వో, ఐసీఎంఆర్‌ ‌నిబంధనల మేరకు పరీక్షలు
  • హైకోర్టు ఆదేశాల అమలుకు రెండు వారాలు గడువివ్వండి : సీఎస్‌

రాష్ట్రంలో కొరోనా బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వానికి పట్టదా ? వైరస్‌ ‌పట్టణాల పరిధి దాటి మారుమూల ప్రాంతాలకు విస్తరిస్తుంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కొరోనా నియంత్రణ, నిర్ధారణ పరీక్షలు, ప్రజలకు అందుతున్న చికిత్సలు, ప్రైవేటు దవాఖానాలలో బాధితుల నుంచి రూ.లక్షలు వసూలు చేయడంపై దాఖలైన పిటిషన్లంటినీ మంగళవారం హైకోర్టు ఏకకాలంలో విచారించింది. ఈ కేసులపై గతంలో హైకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య,ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్‌ ‌డీఎంహెచ్‌వో, జీహెఎంసి కమిషనర్‌ ‌సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా హాజరయ్యారు. ప్రభుత్వ దవాఖానాలలో నిర్వహిస్తున్న టెస్టులు, అందిస్తున్న చికిత్సలు, వసతులపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పక్క రాష్ట్రాలలో వేల సంఖ్యలో టెస్టులు చేస్తుంటే ఇక్కడ తక్కువ సంఖ్యలో ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై సీఎస్‌ ‌సమాధానమిస్తూ డబ్ల్యుహెచ్‌వో, ఐసీఎంఆర్‌ ‌మార్గదర్శకాల ప్రకారమే టెస్టులు చేస్తున్నామనీ సమాధానమిచ్చారు. ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా మందికి టెస్టులు నిర్వహించామని తెలిపారు. హైదరాబాద్‌లో 1085 కంటైన్మెంట్‌ ‌జోన్లను ఏర్పాటు చేసి కొరోనా నియంత్రణకు కృషి చేస్తున్నామని తెలిపారు. నాచారం ఈఎస్‌ఐ ‌హాస్పిటల్‌లో కూడా కొరోనా రోగులకు చికిత్సలు అందజేస్తున్నామని వివరణ ఇచ్చారు.

ఇప్పటి వరకు ప్రభుత్వ దవాఖానాలలో 38 మంది కోవిడ్‌ ‌బాధితులు ఆక్సీజన్‌ అం‌దక మరణిస్తే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ దవాఖానాలలో ఆక్సీజన్‌ అం‌దించడానికి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకున్నారో తెలపాలని ఆదేశించింది.  పాజిటివ్‌ ‌కేసులు రోజురోజుకూ భారీ సంఖ్యలో పెరుగుతున్నప్పటికీ నివారణ, నియంత్రణ చర్యలు చేపట్టడంలో అధికారులు ఎందుకు విఫలమయ్యారో చెప్పాలని పేర్కొంది. మీడియాకు విడుదల చేస్తున్న కొరోనా బులెటిన్‌ ‌సైతం తప్పుల తడకగా ఉందని వ్యాఖ్యానిస్తూ ఈ విషయంలో తమ ఆదేశాలను సైతం పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐసీఎంఆర్‌ ‌మార్గదర్శకాల ప్రకారం పాజిటివ్‌ ‌వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి పరీక్షలు నిర్వహించాలనీ,  ప్రస్తుతం కొరోనా వైరస్‌ ‌హైదరాబాద్‌ ‌దాటి మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించిందనీ, ఆ ప్రాంతాలలో కోరోనా నియంత్రణకు ఏ విధమైన చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. మరోవైపు, కొరోనా మృతుల సంఖ్యను ప్రభుత్వం సరైన విధంగా వెల్లడించడం లేదంటూ మీడియాలో వచ్చిన వార్తలపై సైతం స్పందించిన హైకోర్టు ధర్మాసనం దీనిపై ఆగస్టు 13లోగా పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కొరోనా గణాంకాలు మీడియా ద్వారా విస్త•తంగా ప్రచారం చేసేలా చర్యలు తీసుకోవాలనీ, టెస్టులలో పాజిటివ్‌ ‌వస్తే వారి వివరాలను వయసుల వారీగా బులెటిన్‌లో పేర్కొనాలని స్పష్టం చేసింది. దీనిపై సీఎస్‌ ‌స్పందిస్తూ కొరోనాపై అవగాహన, నియంత్రణ అంశాలపై మీడియాలో విస్త•తంగా చర్చలు జరిగేలా ఆయా సంస్థల యాజమాన్యాలతో చర్చిస్తామని తెలిపారు. ప్రైవేటు హాస్పిటల్స్ ‌బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి 726 ఫిర్యాదులు అందాయనీ, ఆయా దవాఖానల యాజమాన్యాలకు నోటీసలు ఇచ్చామని సీఎస్‌ ‌కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశాలన్నింటినీ అమలు చేయడానికి రెండు వారాల సమయం కావాలని సీఎస్‌ ‌హైకోర్టును కోరగా, అంగీకరించిన హైకోర్టు ధర్మాసనం కొరోనా కేసుల విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది. ఆ రోజు సీఎస్‌ ‌వైద్య, శాఖ ఉన్నతాధికారులు హాజరు కావాలని ఆదేశించింది.

 

Leave a Reply