Take a fresh look at your lifestyle.

హైదరాబాదులో రైతుల ర్యాలీకి హైకోర్టు అనుమతి

అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటి పిలుపులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలనీ, విద్యుత్‌ ‌సవరణ బిల్లును ఉపసంహరించాలనీ, పంటలకు మద్దతు ధరలు గ్యారంటీగా లభించేలా చట్టం తీసుకురావాలని కోరుతూ రాష్ట్రంలో రైతులతో భారీ ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు ఢిల్లీలో జరిగే రైతుల ఆందోళనకు మద్దతుగా ఇందిరా పార్క్ ‌నుంచి నెక్లెస్‌ ‌రోడ్‌ ‌వరకు ర్యాలీకి అనుమతి ఇవ్వాలని ఆఖిల భాతర కిసాన్‌ ‌సంఘర్షణ్‌ ‌కో ఆర్డినేషన్‌ ‌కమిటీ తెలంగాణ శాఖ నాయకురాలు పశ్య పద్మ దరఖాస్తు చేశారు.

ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆమె సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌ ‌విచారణకు అనుమతి ఇచ్చిన హైకోర్టు పిటిషనర్‌ ‌వాదనతో ఏకీభవించింది. పిటిషనర్‌ అభ్యర్థన మేరకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సరూర్‌నగర్‌ ‌స్టేడియం నుంచి ఉప్పల్‌ ‌సర్కిల్‌ ‌వరకు టీ వీలర్స్, ‌కార్లు, ఆటోలతో ప్రదర్శనగా ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ ర్యాలీలో వామపక్ష ప్రజాతంత్ర నాయకులు, రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, యువకలు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పశ్య పద్మ పిలుపునిచ్చారు.

Leave a Reply