Take a fresh look at your lifestyle.

‘‌చిక్కుముడుల’ను విప్పే ప్రయత్నం..!

  • 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు
  • వ్యవసాయానికి 1.60 లక్షల కోట్లు
  • గ్రాణాభివృద్ధికి 1.23 లక్షల కోట్లు
  • పాలు, చేపల రవాణాకు కిసాన్‌ ‌రైలు
  • 2020-21 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌
Finance Minister Nirmala Sitharaman to introduce Union Budget 2020-21వ్యవసాయ రంగానికి రూ.2.83 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ ‌శాఖలకు రూ. 1.23 లక్షల కోట్లు కేటాయిస్తూ 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను  శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 15 లక్షల కోట్లుగా నిర్ణయించారు. దేశంలో ధాన్యం నిలువ సామర్థ్యాన్ని 160 మిలియన్‌ ‌మెట్రిక్‌ ‌టన్నుల సామర్థ్యానికి పెంచుతామని కష్టజీవులకు హామీ ఇచ్చారు. జీఎస్టీ వల్ల పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగిందనీ, తద్వారా దేశంలో ఆదాయ వనరులు భారీగా పెరుగుతున్నాయని వివరించారు.

‘రైతులకు అన్ని రూపాల్లో మేలు జరిగేలే ప్రభుత్వం పలు నిర్ణయాలు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.15 లక్షల కోట్లుగా నిర్ణయించడం వల్ల రైతులకు మేలు జరగనుంది. అలాగే, రైతులకు 20 లక్షల సోలార్‌ ‌పంపు సెట్ల పంపిణీ, బీడు భూముల్లో సోలార్‌ ‌విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు, భూసార పరిరక్షణకు సాయం, రసాయన ఎరువుల నుంచి విముక్తి కలిగించడం, గిడ్డంగుల నిర్మాణానికి నాబార్డు, పీపీపీ పద్దతిలో సాయం అందించడం వల్ల కూడా రైతులు ప్రయోజనం పొందుతారు.  ఇది సామాన్యుల బ్జడెట్‌ అని మధ్యతరగతి కలల బడ్జెట్‌’’  అని ఆమె వ్యాఖ్యానించారు. మనదేశ ఆర్థిక మూలాలు ఎంతో బలంగా ఉన్నాయని, ద్రవ్యల్బణం అదుపులో ఉందని ఆమె అన్నారు.

నిర్మాణాత్మక వ్యవస్థను బలోపేతం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లున్నదని నిర్మలా సీతారామన్‌ ‌బడ్జెట్‌ ‌ప్రసంగంలో స్షష్టం చేశారు. జాతి నిర్మాణంలో అన్నివర్గాలకు చెందిన యువత, మహిళల పాత్ర కీలకమని ఆమె అన్నారు. యువతను మరింత శక్తిమంతం చేసే దిశగా ప్రభుత్వ నిర్ణయాలుంటాయని ఆమె పేర్కొన్నారు. ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తి పెంచే విధంగా ఈ కేంద్రం బడ్జెట్‌ ఉం‌టుందని నిర్మల చెప్పారు.  సాగు, వ్యవసాయ రంగానికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు 16 సూత్రాల కార్యాచరణ ప్రకటిస్తూ.. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేసారు. 6.1 కోట్ల మంది రైతులకు ప్రధాన మంత్రి ఫసల్‌ ‌బీమా యోజన అందిస్తున్నామన్నారు. వ్యవసాయంలో పోటీతత్వం పెంచడమే తమ లక్ష్యమనీ.. వ్యవసాయంలో పెట్టుబడి లాభదాయకం కావాలని ఆమె పేర్కొన్నారు. కేంద్ర చట్టాలు అమలు చేసే రాష్టాల్రకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు.
వ్యవసాయం, నీటిపారుదల, గ్రాణాభివృద్ధికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతనిస్తుందని, ఆ తరువాత ఆరోగ్యం, స్వచ్ఛత, విద్యలకు చోటు కల్పిస్తుందని ఆర్థిక మంత్రి తన బ్జడెట్‌ ‌ప్రసంగంలో వెల్లడించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఈ దేశం వేగంగా అభివృద్ధి చెందుందని చెప్పారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న 100 జిల్లాలకు ప్రయోజనం కలిగించేలా పథకాలు ప్రకటిస్తున్నామని,  సౌరశక్తి ద్వారా వ్యవసాయ పంపుసెట్ల నిర్వహణకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కొత్తగా 15లక్షల మంది రైతులకు సోలార్‌ ‌పంపులు ఇవ్వాలని నిర్ణయించామనీ,  రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి..సేంద్రీయ ఎరువుల వినియోగం పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రీయ ఉత్పత్తుల విక్రయానికి ఆన్‌లైన్‌ ‌పోర్టల్‌ను త్వరలో ప్రారంభించి, దేశంలో 160 మిలియన్‌ ‌మెట్రిక్‌ ‌టన్నుల నిల్వ సామర్థ్యం పెంచనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ధాన్యలక్ష్మి పథకం స్వయ సహాయక బృందాలతో గ్రామాల్లో గిడ్డంగి సదుపాయం కల్పిస్తారు. ధాన్యలక్ష్మి పథకానికి ముద్ర, నాబార్డ్ ‌సాయం తీసుకుంటారన్నారు.
image.png
పాలు, చేపల రవాణాకు కిసాన్‌ ‌రైలును  భారతీయ రైల్వే పీపీపీ భాగస్వామ్యంతో కిసాన్‌ ‌రైలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కృషి ఉడాన్‌ ‌పేరుతో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి విమానాలు అందుబాటులోకి తీసుకుని వస్తారన్నారు. ఉద్యానవన ఉత్పత్తులు 311 మిలియన్‌ ‌మెట్రిక్‌ ‌టన్నులకు చేరాయి. 2020-21లో అగ్రికల్చర్‌ ‌ఫైనాన్స్ ‌లక్ష్యం రూ.15 లక్షల కోట్లుగా నిర్ణయించినుట్ల తెలిపారు. ప్రస్తుతమున్న 58 లక్షల స్వయం సహాయక బృందాలను మరింత విస్తరిస్తాం అన్నారు. వ్యవసాయ రంగానికి రూ.2.83 లక్షల కోట్లు కేటాయింపు ఉంటుందన్నారు.  ధాన్యం కొనుగోలుకు నాబార్డు ద్వారా ఎస్‌ఎస్‌ ‌జీలకు సాయం చేయాలని నిర్ణయించారు. ఉద్యాన పంటల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం అందించాలని, వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న జిల్లాలకు సాగునీటి సదుపాయం కల్పనకు అదనపు నిధుల మంజూరుకు నిర్ణయం తీసుకున్నారు. 3400 సాగర మిత్రల ఏర్పాటు, కూరగాయల సరఫరాకు ’కృషి ఉడాన్‌ ‌యోజన’ ప్రారంభిం చనున్నారు. కోస్తా ప్రాంతాల్లోని గ్రాణ యువతకు మత్స్య పరిశ్రమాభివృద్ధి పై మరింత సాయం చేయనున్నట్లు మం త్రి ప్రకటించారు.  భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని, ద్రవ్యోల్బణాన్ని సమర్థవంతంగా అదుపు చేయగలిగామని ఆమె అన్నారు.
ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెబుతూ ఆకాంక్షలు, ఆర్థిక ప్రగతి, ప్రజల సంరక్షణ అనే మూడు అంశాల దే తన బ్జడెట్‌ ‌రూపొందిందని ఆమె అన్నారు. డీమ్డ్ ‌యూనివర్సిటీ హోదాతో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌హెరిటేజ్‌ అం‌డ్‌ ‌కన్జర్వేషన్‌ ఏర్పాటుతోపాటు స్వచ్ఛభారత్‌ ‌మిషన్‌కు రూ.12,300 కోట్లు,వైద్యరంగానికి రూ.69,000 కోట్లు,జల్‌జీవన్‌ ‌మిషన్‌కు రూ.3.6 లక్షల కోట్లు ప్రకటించారు. టైర్‌-2, ‌టైర్‌-3 ‌పట్టణాల్లో పీపీపీ పద్ధతిలో ఆసుపత్రులు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన. జన్‌ ఔషధి కేంద్రాలను మరింత విస్తరిస్తామన్నారు.  ఈ ఏడాదికొత్తగా 150 ఉన్నత విద్యా సంస్థల్లో అప్రెంటిస్‌షిప్‌ ‌ప్రారంభిస్తామని, అలాగే అప్పుడే ఇంజినీరింగ్‌ ‌విద్య పూర్తి చేసుకొని వచ్చిన విద్యార్థులకు పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల ద్వారా ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. విద్యారంగానికి రూ.99,300 కోట్లు కేటాయింపుతో పాటు నైపుణ్యాల మెరుగుదలకు రూ.3,000 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. నేషనల్‌ ‌పోలీస్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
టీచర్లు, పారామెడికోల సంఖ్యను పెంచుతామనీ,  జిల్లా ఆసుపత్రుల్లో వైద్యకళాశాలల ఏర్పాటు.జిల్లా ఆసుపత్రులతో మెడికల్‌ ‌కాలేజీల అనుసంధానం చేస్తామన్నారు. భారత్‌లో చదువుకునేందుకు ’ఇండ్‌సాట్‌’ ‌కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మ్యూజియాలుగా పురావస్తు స్థలాల అభివృద్ది అయిదు పురావస్తు స్థలాలను మ్యూజియాలను మారుస్తున్నట్లు ప్రకటించారు. హర్యానాలోని రాఖీగఢీ, యూపీలోని హస్తినాపూర్‌, అస్సాంలోని శివ్‌ ‌సాగర్‌, ‌గుజరాత్‌లోని దోలావీరా, తమిళ్‌నాడులోని ఆదిచనెల్లూరులను మ్యూజియాలుగా మారుస్తున్నట్లు ఆమె ప్రకటించారు. 2020లో జీ20 సదస్సుకు రూ.100 కోట్లను ప్రకటించారు. లఢక్‌ అభివృద్ధికి రూ.5958 కోట్లు, జమ్మూకశ్మీర్‌ ‌కోసం రూ.38,757 కోట్లు కేటాయిస్తున్నట్లు పార్లమెంటులో వార్షిక బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌వెల్లడించారు.
image.png

రూ.5లక్షల ఆదాయం వరకు పన్ను లేదు,మార్పులతో రూ.40వేల కోట్ల ఆదాయానికి గండి
దాయపన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా బ్జడెట్‌- 2020-21 ‌లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్య, ఎగువ మధ్య తరగతి వారికి ఊరటనిచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పుల కారణంగా కేంద్రం రూ.40వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోనుంది. 2020-2021 కేంద్ర బడ్జెట్‌ను శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదాయపు పన్నుకు సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. ఆదాయపన్ను శ్లాబ్‌ల్లో మార్పులు చేస్తున్నట్టు తెలిపారు. కొత్త శ్లాబ్‌ల ప్రకారం..రూ.5 లక్షల నుంచి రూ.7.5లక్షల వరకు రూ.10 శాతం పన్ను విధించారు. రూ.7.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు 15శాతం, రూ.10లక్షల నుంచి రూ.12.5లక్షల వరకు 20శాతం పన్ను, రూ.12.5 లక్షల నుంచి రూ.15లక్షల వరకు 25 శాతం, రూ.15లక్షలకు పైగా వేతనం పొందే వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. రూ.0 నుంచి రూ.5లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు.కొత్త ఆదాయ పన్ను విధానం ఐచ్ఛికం అని తెలిపారు. మినహాయింపులు పొందాలా? వద్దా? అన్నది వేతన జీవుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. రూ.5లక్షల నుంచి రూ7.5లక్షల వరకు 20శాతం,రూ..7.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు 20 శాతం, రూ.10లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు 30శాతం,రూ.12.5లక్షల నుంచి రూ.15లక్షల వరకు 30శాతం, రూ.15లక్షల కంటే ఎక్కువ ఆదాయం పొందే వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉండేది.

image.png

ఎల్‌ఐసీ వాటాల విక్రయం

ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ వాటాల విక్రయానికి నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ‌తెలిపారు. ఎల్‌ఐసీని స్టాక్‌ ‌మార్కెట్‌లో లిస్టింగ్‌కు తీసుకుని రానున్నట్లు వెల్లడించారు. బ్యాంకుల్లో ప్రైవేటు భాగస్వామ్యం పెరగాలి. స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులకు మరిన్ని ప్రోత్సాహకాలు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.3.5 లక్షల కోట్లు మూలధన సాయం అందించనున్నారు. ఐడీబీఐ బ్యాంకుల్లో వాటాల విక్రయానికి నిర్ణయించారు. బ్యాంకు డిపాజిట్లపై బీమా రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ‌తెలిపారు. పన్ను చెల్లింపుదారులను కాపాడుతామని,పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి వేధింపులు ఉండవన్నారు.   ప్రభుత్వ రంగ సంస్థల్లో మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామని, పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.

 

image.png
 నైపుణ్యాభివృద్దికి కేవలం 3 వేల కోట్లా?
2020-21 బడ్టెట్‌లో కేవలం రూ।। 3 వేల కోట్లు కేటాయించడం యువతకు పూర్తిగా నిరుత్సాహం కలిగివచే అంశం. ఇటీవల అంతర్టాతీయ సర్వేలు సైతం భారత్‌లో ఇంజనీరింగ్‌ ‌వంటి కోర్సుల్లో డిగ్రీలు పొందిన వారు సైతం నైపుణ్య లేమితో అంతర్జాతీయంగా కనీస పోటీని కూడా ఇవ్వలేక పోతున్నారని తెల్పినా ఈ విషయంలో ఇంత నిర్లక్ష్య చూపడం ఆశ్యర్యం కిలిగించే అంశం. నిర్మలా సీతారామన్‌ ‌బడ్జెట్‌ ‌ప్రసంగంలో యువతను ప్రతేకంగా ప్రస్తావించినప్పటికీ చేతల్లో మాత్రం రిక్త హస్తాలు చూపడం ఎంత మాత్రం సమర్థనీయం కాదు.

Leave a Reply