Take a fresh look at your lifestyle.

‌ట్రంప్‌ ‌రాక ప్రత్యేకమైంది: మోదీ

Trump is special Modi

భారీగా స్వాగత ఏర్పాట్లుచేస్తున్న ప్రభుత్వం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌రాక అత్యంత ఆనందాన్ని కలిగిస్తుందని ప్రధాని మోదీ ట్వీట్‌ ‌చేశారు. ఆత్మీయ అతిథికి మరిచిపోలేని స్వాగతం ఏర్పాటు చేస్తామని మోదీ అన్నారు. ట్రంప్‌ ‌రాక ప్రత్యేకమైందని, భారత్‌, అమెరికా స్నేహబంధాన్ని బలోపేతం చేసేందుకు అది దోహదపడుతుందని మోదీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, బహుళత్వం అంశంలో రెండు దేశాలు ఒకేవిధంగా కట్టుబడి ఉన్నాయన్నారు.

అనేక అంశాల్లో రెండు దేశాలు విస్తృత స్థాయిలో సహకారం అందజేసుకుంటున్నాయన్నారు. మన స్నేహబంధం వల్ల ప్రపంచ దేశాలకు కూడా మంచి జరుగుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ ఈనెల 24వ తేదీన భారత్‌ ‌రానున్న విషయం తెలిసిందే. న్యూఢిల్లీతో పాటు ఆయన అహ్మదాబాద్‌లో పర్యటిస్తారు. అక్కడ కొత్తగా నిర్మించిన మోతేరా స్టేడియంలో భారీ సభలో ట్రంప్‌ ‌ప్రసంగించనున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply