Take a fresh look at your lifestyle.

గెలిచే పార్టీ టీఆర్‌ఎస్సే ఏ పార్టీతో పొత్తు లేదు: మంత్రి హరీష్‌ ‌రావు

TRSS, affiliate, party Minister, Harish Rao, finance minister

  • ఏ పార్టీతో పొత్తు లేదు నూటికి నూరు శాతం టీఆర్‌ఎస్‌ అభ్యర్థే మున్సిపల్‌ ‌ఛైర్మన్‌
  • ‌సంగారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు

మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచే పార్టీ టీఆర్‌ఎస్సే అని, ఏ పార్టీతో మనకు పొత్తు లేదని, నూటికి నూరు శాతం టీఆర్‌ఎస్‌ అభ్యర్థే మున్సిపల్‌ ‌ఛైర్మన్‌ అవుతారని ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. శనివారం సంగారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఆర్థిక మంత్రి హరీశ్‌ ‌రావు పర్యటించారు. పట్టణంలోప్రధాన వీధుల్లో రోడ్‌ ‌షో నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏ పార్టీకీ మద్దతు ఇవ్వబోమని , ఒంటరిగానే 30 వార్డులు గెల్చుకుంటామని ప్రకటించారు. మంచి నీళ్ల సమస్య ఉందని, అది పరిష్కారం అయిందని అన్నారు. ఈ సంవత్‌ం ‌లోనే మిషన్‌ ‌భగీరథ ద్వారా ఇంటింటికినీళ్లు తెచ్చి ఇచ్చే బాధ్యత నాదని అన్నారు. కాళేశ్వరం నీళ్లు మూడు నాలుగు నెలల్లో వస్తాయని తెలిపారు. మంజీర లోవర్షాలు పడలేదని, అందుకే సీఎం కేసీఆర్‌ ‌సింగూరుకు గోదావరి జలాలు తేవాలని నిర్ణయించారని అన్నారు. గోదావరి జలాలతో సింగూరు దాహార్తి తీరుస్తామని స్పష్టం చ్నే.

ఎం కేఆర్‌ ‌మాట తప్పని, మడమ తిప్పి నేత అని, మిగతా వారితో పనులవుతాయా అని, మాటలు చెప్పి మాయమయ్యే నేతలు వీరని అన్నారు. చేతల ప్రభుత్వం తెరాస అని తెలిపారు. తెరాసను గెలిపించండి అని, సంగారెడ్డిని దత్తత తీసుకొని అన్ని వార్డులు తిరిగి సమస్యలు పరిష్కరిస్తానని, ఎన్నికలప్పుడే కాదు మీకు సేవ చేసేందుకు ఎన్నికల తర్వాత వస్తానాని మీ సమస్యలు పరిష్కరిస్తాననిహామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ ‌పట్టణ ప్రగతి కార్యక్రమం పెట్టనున్నార పల్లె ప్రగతి ద్వారా పల్లెలరూపు మారాయని తెలిపారు. ఎన్నికల తర్వాత పట్టణ ప్రగతిలో నేను సంగారెడ్డి పై ప్రత్యేక శ్రద్ద పెట్టి సంగారెడ్డిని అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఓ పెద్దమనిషి ని గతంలో మున్సిపల్‌ ‌ఛైర్మన్‌ ‌చేస్తే ఆరుగురి ఉద్యోగాలు పోయాయని, నలుగురు చనిపోయారని, సస్పెండ్‌ అయ్యారని, కోర్టులచుట్టూ తిరిగారని గుర్తు చేశారు. ఇలాంటివ్యక్తులకు ఓటు వేస్తారా?నిజాయితీగా పని చేసే వారికి ఓటు వేస్తారా అని మీరే ఆలోచించండని అన్నారు. పని చేసేవారికి ఓటువేయండి, వచ్చే నాలుగేళ్లు తెరాస ప్రభుత్వమే ఉంటుంది, అభివృద్ధికి సహకరించే తెరాస అభ్యర్థులను గెలిపించండి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోఎంపీ కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, రాష్ట్ర బ్రువరీస్‌ ‌చైర్మెన్‌ ‌దేవి ప్రసాదరావు, మాజీ ఎమ్మేల్యే చింతా ప్రభాకర్‌, ఆయావార్డుల అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags: TRSS, affiliate, party Minister, Harish Rao, finance minister

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply