వోటర్లను దోఖా చేసే కుట్రలకు పాల్పడుతున్న టిఆర్ఎస్, ఎంఐఎం
ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన విజయశాంతి
తాము తలచుకుంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని రెండు నెలల్లోనే పడగొడతామని ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ హెచ్చరించారు. ఒకరిని గద్దెపై కూర్చోబెట్టడం తెలుసు.. గద్దె కేటీఆర్‌ను చిలుక అంటూ సెటైర్లు వేశారు. మజ్లిస్ పార్టీ ఎంతో మందిని చూసిందని.. ఆయన మొన్నే రాజకీయాల్లోకి వచ్చాడని అన్నారు. తమ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెప్పినట్లు.. రాజకీయం మా ఇంటి గుమాస్తాతో సమానమని ముంతాజ్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ సినీ న• విజయశాంతి విజయశాంతి అలియాస్ రాములమ్మ తనదైనశైలిలో ఘాటుగానే స్పందించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేస్తూ.. బీహార్‌లో టిఆర్ఎస్-ఎంఐఎం కలసి బలమైన ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిని ఓడగొడితే.. దేశవ్యాప్తంగా ఉన్న మైనార్టీలు ఇక కాంగ్రెస్ గెలవదు అన్న అభిప్రాయానికి వస్తారని అన్నారు. తద్వారా చాలా రాష్ట్రాల్లో పట్టు ఏర్పరుచుకుని, పొత్తుల ద్వారా దేశమంతా వ్యాప్తి చెందాలనే ప్రయత్నం చేశారన్నారు. అందుకు అవసరమైన పెద్ద ఎత్తున నిధులను కూడా టిఆర్ఎస్ అందించినట్లు రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయని విజయశాంతి తెలిపారు. అయితే ఆ ఫలితాల వల్ల తెలంగాణలోని మొత్తం మైనార్టీలు టిఆర్ఎస్-ఎంఐఎంలకు కూడా దూరమయ్యే దిశగా చర్చిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయన్నారు. ఆ ప్రమాదం నుంచి బయటపడేందుకు టిఆర్ఎస్ అధినేత ఎంఐఎంతో కలిసి చర్చించి, తిరిగి మైనార్టీల నమ్మకం పొందగలిగే ఎత్తుగడలో భాగంగా దేశవ్యాప్త నేతలతో సమావేశాలు, మోడీపై యుద్ధం లాంటి నిష్ఫలమైన ప్రసంగాలు చేస్తున్నారని చెప్పారు. గతంలో వీరి ఫెడరల్ ఫ్రంట్ విన్యాసాలు అందరూ చూసినవేనన్నారు. ఇక ఈ రోజు(ఆదివారం)టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని దింపుతామన్న ఎంఐఎం ఎమ్మెల్యే వ్యాఖ్యలు పూర్తిగా టిఆర్ఎస్-ఎంఐఎంల మ్యాచ్ ఫిక్సింగ్‌తో వోటర్లను దోఖా చేసే కుట్రని విజయశాంతి వ్యాఖ్యానించారు. ఎంఐఎం 7గురు ఎమ్మెల్యేలతో ప్రభుత్వానికి అవసరం లేదనీ, అధికారం నుంచి పడదని చెప్పారు. అంటే ఎంఐఎం మతకలహాలు సృష్టించి ప్రభుత్వాన్ని కూలదోస్తామని చెబుతున్నట్టా? అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలయ్యాక టిఆర్ఎస్-ఎంఐఎంలు అవసరమైతే పొత్తు పెట్టుకు తీరుతాయన్నారు. అవసరం లేకున్నా కలిసే ఉంటాయని చెప్పారు. ఆ రెండూ పార్టీలూ వీడదీయలేని సయామీ ట్విన్స్ అని విజయశాంతి తెలిపారు. ఇదిలా ఉంటే,ఎంఐఎం, టిఆర్ఎస్ పార్టీలు చాలా కాలంగా మిత్రపక్షంగా ఉంటూ వస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను అసెంబ్లీ వేదికగా మజ్లిస్ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. సిఎం కేసీఆర్‌పై పలు సందర్భాల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రశంసలు కురిపించారు. కానీ, టిర్ఎస్పై మజ్లిస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే, ఎంఐఎం, టిఆర్ఎస్ ఒక్కటేనని.. టిఆర్ఎస్కు వోటేస్తే ఎంఐఎంకు వేసినట్లేనని బిజెపి చాలాసార్లు ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
……………………………………………………………………………………………………………………………