Take a fresh look at your lifestyle.

తెరాసకు ఓటమి తప్పదు

పట్టభద్రుల ఎన్నికల్లో రామ్ చందర్ రావు  విజయాన్ని  కెసిఆర్ అడ్డుకోలేరు

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

హైదరాబాద్, ప్రజాతంత్ర ప్రతినిధి :
త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకీ తిరుగులేదనీ రెండు నియోజకవర్గలోనూ బీజేపీ అభ్యర్థులు  విజయంసాధించడం ఖాయమని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. జీహేచ్ఎంసీ, దుబ్బాక ఎన్నికల్లో మాదిరిగానే   పట్టభద్రులు తెరాసకు  గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఆదివారం పీర్జాదిగూడ లోని బండి గార్డెన్స్ లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిఎన్. రామ్ చందర్ రావు కు మద్దతుగా నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. గతంలో తెరాస పార్టీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్న సమయంలోనే ఈ నియోజకవర్గం నుంచి రాంచందర్ రావు విజయం సాధించారాని ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన విజయం కష్టం కాదన్నారు. తెలంగాణ ప్రజలు కెసిఆర్ కుటుంబ పాలన నుంచి మార్పు కోరుకుంటున్నారనీ ఈమార్పు ఎమ్మెల్సీ   ఎన్నికలతోనే ప్రారంభం అవుతుందన్నారు. సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ కు ఎన్నికలు రాగానే ప్రధాని మోడీ, బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం అలవాటైపోయిందనీ ప్రజలు ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి తెరాసకు బుద్ధి చెప్పాలని కోరారు. ఆరేళ్లుగా శాసనమండలిలో విద్యార్థులు, నిరుద్యోగులు, రైతుల పక్షాన పోరాడిన రాంచందర్ రావు ను విమర్శించే నైతిక హక్కు కె టీ  ఆర్ కు లేదన్నారు. బీజేపీ అభ్యర్థి రాంచందర్రావు నిజాయితీ కలిగిన నేత అనీ ఆయనకు మొదటి ప్రాధాన్యత వోటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు.
పీవీని  గౌరవిద్దాం, బీజేపీని గెలిపిద్దాం : రాంచందర్రావు
కెసిఆర్ కు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వోట్లు అడిగే మొఖం లేక పీవీ కూతురు వాణీదేవిని అభ్యర్తిగా నిలబెట్టారని ఏద్దేవా చేశారు. పీవీని గౌరవిద్దాం, తెరాస ను ఓడిద్దాం, బీజేపీని గెలిపిద్దామని వోటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీగా ఆరెళ్లలో ఒక్కరోజు కూడా గైర్హాజరు కాకుండా మండలిలో ప్రజా సమస్యలపై పోరాడాననీ తనకు   పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత వోటు వేసి గెలిపించాలని ఈ సందర్బంగా ఆయన కోరారు.

Leave a Reply