Take a fresh look at your lifestyle.

జాతీయ రాజకీయ వ్యవస్థను శాసించేలా టిఆర్‌ఎస్‌

  • త్యాగాల రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి
  • భారతదేశానికి దిక్సూచిగా మారింది
  • హుజూరాబాద్‌లో బిజెపి, కాంగ్రెస్‌ ‌కుమ్మక్కు …ఈటల పోటీ వెనక రహస్యం ఇదే
  • హైటెక్స్‌లో పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన కెటిఆర్‌
  • ‌టిఆర్‌ఎస్‌ ‌ప్లీనరీ సిడి ఆవిష్కరించిన మంత్రి

జాతీయ రాజకీయ వ్యవస్థను శాసించే స్థాయికి తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ టిఆర్‌ఎస్‌ ఎదిగిందని పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌, ‌మంత్రి కెటిఆర్‌ అన్నారు. రాష్ట్ర సాధన క్రమంలో ఎన్నో పోరాటాలు చేశామని, ఎంతో మంది త్యాగాలు చేశారని కేటీఆర్‌ ‌తెలిపారు. అలా సాధించుకున్నరాష్ట్రంలో అభివృద్ధి ఇప్పుడు కళ్లకు కనపిస్తుందన్నారు. ఇవాళ తెలంగాణ భారతదేశానికే దిక్సూచిగా మారిందని అన్నారు. పక్క రాష్ట్రాల్లోని బీజేపీ ఎమ్మెల్యేలు కూడా తెలంగాణలో తమ నియోజకవర్గాలను కలుపాలని కోరుతున్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయని పక్క రాష్టాల్ర బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశంసిస్తున్నారని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఈ నెల 25న హైటెక్స్ ‌వేదికగా జరగబోయే టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.

శనివారం ఉదయం ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కేటీఆర్‌ ‌వి•డియాతో మాట్లాడారు. అక్టోబర్‌ 25‌న ఉదయం 10 గంటలకు ప్లీనరీ ప్రారంభం అవుతుందని కేటీఆర్‌ ‌తెలిపారు. 6 వేల పైచిలుకు ప్లీనరీ ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్లీనరీ ప్రాంగణంలో రిజిస్ట్రేషన్‌ ‌పక్రియ కోసం 35 కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. పోలీసులకు ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు. నగర ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 50 ఎకరాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు చేశామన్నారు. 8 వేల వాహనాలకు సరిపోయే విధంగా పార్కింగ్‌ ‌సౌకర్యం కల్పించామన్నారు. రిజిస్ట్రేషన్‌ ‌పక్రియ ముగిసిన వెంటనే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి సెషన్‌ ఉం‌టుంది. ఈ సెషన్‌లో పార్టీ అధ్యక్ష ఎంపిక, కొన్ని తీర్మానాలు ఉంటాయి. రెండో సెషన్‌ 2 ‌నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.

ఈ సమయంలో తీర్మానాలతో పాటు ఇతర కార్యక్రమాలు ఉంటాయి. మొత్తం 7 తీర్మానాలను ప్రవేశ పెడుతున్నామని తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామ సమయం ఉంటుంది. ప్లీనరీకి హాజరయ్యే ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు ఏర్పాటు చేశామన్నారు. ప్లీనరీకి వొచ్చే పురుష ప్రతినిధులు గులాబీ రంగు చొక్కాలు ధరించాలని, మహిళా ప్రతినిధులయితే గులాబీ రంగు చీరలు ధరించాలని ఇప్పటికే చెప్పామని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. పార్టీ ఎంపిక చేసిన ప్రజాప్రతినిధులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. పాస్‌లు సాయంత్రం వరకు అందుతాయన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ జడ్పీ చైర్మన్లతో పాటు పార్టీ ముఖ్యులకు నియోజకవర్గాల వారీగా సమాచారం అందుతుంది.

వారు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని కేటీఆర్‌ ‌తెలిపారు. ఏప్రిల్‌ 27, 2001‌న కేసీఆర్‌ ‌నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ పురుడు పోసుకుందని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఒక ప్రాంతీయ పార్టీగా, ఉద్యమ సంస్థగా ఆవిర్భవించి రాష్ట్ర సాధనే లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చింది. బోధించు, సవి•కరించు, పోరాడు అనే అంబేద్కర్‌ ‌తత్వాన్ని పూర్తి స్థాయిలో ఆచరణలో పెట్టి తెలంగాణను సాధించామన్నారు.

హుజూరాబాద్‌లో బిజెపి, కాంగ్రెస్‌ ‌కుమ్మక్కు …ఈటల పోటీ వెనక రహస్యం ఇదే
ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని చీకటి ఒప్పందాలు చేసినా..టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌హుజురాబాద్‌ ‌ప్రజల ఆశీర్వాదాలతో తప్పకుండా గెలుస్తారని టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. హైటెక్స్ ‌ప్రాంగణంలో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కేటీఆర్‌ ‌వి•డియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, ‌బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ ‌హుజురాబాద్‌లో పోటీ చేస్తున్నారని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఈ మాటను వారు కాదని చెప్తే..అందుకు సంబంధించిన సాక్ష్యాలను తానే బయటపెడుతానని స్పష్టం చేశారు. గతంలో కరీంనగర్‌, ‌నిజామాబాద్‌ ‌లోక్‌సభ ఎన్నికలతో పాటు నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో చీకటి ఒప్పందం చేసుకున్నట్టే.. ఇవాళ హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌, ‌బీజేపీ కుమ్మక్కయ్యాయని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌ ‌పార్టీని నిలువరించేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు గురివింద గింజ సామెతను గుర్తు చేసుకోవాలన్నారు. రేవంత్‌ ‌రెడ్డి, ఈటల రాజేందర్‌ ‌లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. ఎన్ని కుట్రలు చేసినా విజ్ఞులయిన ప్రజలు టీఆర్‌ఎస్‌ ‌పార్టీనే గెలిపిస్తారు. మాణికం టాకూర్‌ ‌రూ. 50 కోట్లకు పీసీసీ పదవిని అమ్ముకున్నారని సొంత పార్టీ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి చేసిన విమర్శలపై ఇప్పటివరకు స్పందించలేదు.. ఇప్పటిదాకా దానిపైన మాట్లాడలేదని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మూలాలు ఉన్న వ్యక్తులకు కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్ర తాంబూలం ఇస్తుందని పంజాబ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ ‌సింగ్‌ ‌కూడా వ్యాఖ్యానించారని కేటీఆర్‌ ‌తెలిపారు. రేపో మాపో కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరుతానని చెప్పే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ ‌రెడ్డి, బీజేపీకి వోటేయమని ఎలా చెప్తారని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు.

టిఆర్‌ఎస్‌ ‌ప్లీనరీ సిడి ఆవిష్కరించిన మంత్రి
టీఆర్‌ఎస్‌ ‌ప్లీనరీ నేపథ్యంలో రాసిన పాట సీడీని శనివారం మంత్రి కెటిఆర్‌ ఆవిష్కరించారు. పార్టీ నేత కర్నాటి విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో ‘గులాబీ జెండా కేసీఆర్‌’ అనే పాట ఆడియో సీడీని రూపొందించారు. ఈ సీడీని టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌కేబినెట్‌ ‌మంత్రి కె. టి. రామారావు ఆవిష్కరిచారు. తెలంగాణ భవన్‌లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పాటను ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్‌ ‌తేజ రచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పి. రాములు, టీఆర్‌ఎస్‌ ‌ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌ ‌రెడ్డి, కర్నాటి విద్యాసాగర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply