- టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- రాష్ట్రంలో ఉన్న అన్ని జాతీయ రహదారుల మీద మోహరించి భారత్ బంద్ కు మద్ధతు తెలుపుతాం
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విదానాలపై పార్ల మెంట్ లో టిఆర్ఎస్ పోరాడిందని..రైతు వ్యతిరేక చట్టాలపై ఓటింగ్ సమయంలో బలంగా తమ ఎంపీలు వాదానలు వినిపించార టి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొత్తగా ఎన్నికయిన ఆ పార్టీ కార్పొరేటర్ల తో సమావేశమయిన కేటీఆర్ ..ఆ తరువాత మీడియా తో మాట్లాడుతూ ..ఢిల్లీలో రైతులు ఎముకలు కొరికే చలిలో దర్నాలు చేస్తున్నారు..వారి పోరాటం కేసీఆర్ హృదయాన్ని ద్రవింపచెశాయి.
కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాల వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ రైతులకు సంఘీభావంగా 8న భారత్ బంద్ కు టిఆర్ఎస్ మద్ధతు తెలుపుతుందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి వ్యాపారవేత్త మంగళవారం 12 గంటలకు షాపులు తెరుచుకోవాలని ..మంగళవారం రెండు గంటలు ఆలస్యంగా షాపులు తెరుచుకోవాలి కోరారు.రైతులకు మద్ధతుగా నిలవాల్సిన సమయం ఇది…రవాణా రంగం నుంచి కూడా భారత్ బంద్ కు మద్ధతు తెలపాలని కె టీ ఆర్ పిలుపునిచ్చారు. అంతకు ముందు ఆదివారం ఉదయం రైతుల పోరాటానికి మద్దతుగా 8 న తలపెట్టిన భారత్ బంద్ కు రాష్ట్ర ముఖ్య మంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు కూడా మద్దతు తెలిపారు.