Take a fresh look at your lifestyle.

నేడు రాష్ట్రవ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ ‌ధర్నాలు

కేంద్రం తీరుపై ఆందోళన
ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం ధర్నాలు కొనసాగుతున్నాయి. ధాన్యం రాష్ట్రమే కొనుగోలు చేయాలని ఈ నెల గురవారం బిజెపి ధర్నాలు నిర్వహించగా, నేడు టిఆర్‌ఎస్‌ ‌ధర్నాలకు దిగుతుంది. కేంద్రమే ధాన్యం కొనుగోళ్లు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ నియోజకవర్గాల స్థాయిలో పెద్ద ఎత్తున ధర్నాలకు టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌పిలుపునిచ్చారు. దీంతో శుక్రవారం ధర్నాలకు టిఆర్‌ఎస్‌ ‌నేతలు రాష్ట్రవ్యాప్తంగా సన్నద్దం అయ్యారు. కేంద్రం నుంచి ధాన్యాన్ని కొనేలా చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జరుప తలపెట్టిన ధర్నా కార్యక్రమాలకు టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలు కార్యారణచేశారు. ఈ నెల 29న వరంగల్‌ ‌విజయోత్సవ సభ రద్దు కావడంతో ఇప్పుడు టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు ఈ ఆందోళనలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కదులుతున్నారు.

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా ఈ ధర్నాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వరిపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలకు, రాష్ట్రంలోని బిజెపి నేతల మాటలకు పొంతనలేదని పరస్పరం విరుద్దంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర బిజెపి నేతలు వరి పండించాలని చెబుతుండగా? అసలుధాన్యం కొనుగోలు చేసేదే లేదని కేంద్రం ఖరాఖండిగా చెబుతోందని మండిపడ్డారు. దేశంలో పంజాబ్‌ ‌తర్వాత రాష్ట్రంలోనే అత్యధికంగా వరి పండుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చేస్తుందని వారు స్పష్టం చేశారు. సాగుచట్టాలతో రైతులను కేంద్రం ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. కేంద్రం నిర్ణయాలపై దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాల మద్దతు తీసుకుంటామన్నారు. పార్లమెంట్‌ ‌సమావేశాల్లోనూకేంద్ర వైఖరిని టిఆర్‌ఎస్‌ ఎం‌పిలు తీవ్రస్థాయిలో ఎండగట్టనున్నామన్నారు.

సంబంధిత అధికారుల నుంచి ముందస్తూ అనుమతులు తీసుకుని ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. 12వ తేదీన తలపెట్టిన ధర్నాకు కలెక్టర్ల నుంచి ముందస్తూ అనుమతులు తీసుకోవాలని టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కెటిఆర్‌ ‌దిశానిర్దేశం చేశారు. రైతులకు సంఘీభావంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ‌వద్ద టిఆర్‌ఎస్‌ ‌తలపెట్టిన ధర్నాను మంత్రి తలసాని బాధ్యతగా తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా నిరసనలు కొనసాగుతాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. బిజెపి ధర్నాలను డ్రామాలుగా అభివర్ణించారు. తెలంగాణ ప్రభుత్వంపై కుట్రలు చేస్తూ ఇబ్బందులు పెడుతుందని విమర్శించారు. ఇందుకు నిరసనగా టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆదేశం మేరకు ఈ నెల 12 శుక్రవారం జిల్లాలో రైతు ధర్నాలు చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. పెద్దఎత్తున రైతులతో కలిసి కేంద్రం వైఖరికి నిరసనగా ధర్నాలు నిర్వహిస్తామన్నారు.

శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్నాహ్నం ఒంటి గంట వరకూ ధర్నాలు చేయాలని టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు, రైతులకు పిలుపునిచ్చారు. బిజెపి నేతలు సైతం తెలంగాణ రైతాంగానికి మేలు చేసేవిధంగా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి పియూష్‌ ‌గోయల్‌ ఇం‌టి ముందు ధర్నా చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ తలపెట్టిన ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply