Take a fresh look at your lifestyle.

హుజూరాబాద్‌లో టిఆర్‌ఎస్‌ ‌పైసల రాజకీయం

  • దళిత బంధును రాష్ట్రమంతా అమలు చేయాలి
  • ఈటల రాజేందర్‌ ‌డిమాండ్‌

హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ‌పైసల రాజకీయం చేస్తుందని బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. ప్రలోభాలు, బెదిరింపులతో వోటర్లను లోబర్చుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఏ కులాన్ని వొదిలిపెట్టకుండా పథకాలు అమలు చేస్తూ జీవోలు విడుదల చేశారని ఆరోపించారు. ఆ పార్టీ వాళ్లు సొంత పార్టీ వాళ్లనే కొనుక్కుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌ ‌మధువాణి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన వి•డియాతో మాట్లాడుతూ..‘ప్రతిపక్షాల వాళ్లను బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారు. మంత్రులే లిక్కర్‌ ‌లోడ్‌ ‌తీసుకొచ్చి పంచుతున్నారు. కులాల వారీగా డబ్బులు పంచుతున్నారు. కుల సంఘాల పేరుతో రాజకీయం చేస్తున్నారు. కుల సంఘాలకు గుడులు కట్టిస్తామంటూ లోబరచుకుంటున్నారు.

కుల సంఘాల వి•ద ప్రేమతో డబ్బులు ఇస్తామనడంలేదు. వోట్ల కోసమే ఇదంతా చేస్తున్నారు. దళితుల వి•ద ప్రేముంటే.. ఏడున్నరేండ్లతో ఒక్క పథకం కూడా ఎందుకు తీసుకురాలేదు. కేసీఆర్‌ ఇప్పటికీ జైభీమ్‌ అని ఎందుకు అనడం లేదు. దళితబంధు కేవలం హుజూరాబాద్‌లోనే కాకుండా.. రాష్ట్రమంతా ఇవ్వాలి’ అని ఈటల డిమాండ్‌ ‌చేశారు. వి•కు ఏవేవో ఇస్తామని చెప్పి..ఈటల రాజేందర్‌ను బొంద పెట్టాలని చూస్తున్నారు.

సీఎంకు చిత్తశుద్ధి ఉంటే వి•రిచ్చిన హావి•లెన్నో అమలు కావడంలేదు. అవన్నీ అమలుచేయాలి. ధనిక రాష్ట్రమని చెబుతున్నారు కదా..మరి పెన్షన్లు, నిరుద్యోగ భృతి, చివరికి ఆరోగ్య శ్రీ డబ్బులు కూడా ఎందుకు విడుదలచేయడం లేదని ఈటల ప్రశ్నించారు.

Leave a Reply